వివాదాలకు కేరాఫ్‌గా వేద పాఠశాల

ABN, Publish Date - Apr 14 , 2025 | 02:47 PM

బాసరలోని ప్రైవేట్ వేద పాఠశాల వివాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. శ్రీ వేద భారతీ పీఠంలో వివాదాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. దీంతో, వేద పాఠశాల తీరుపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Basara Sri Veda School: బాసరలోని ప్రైవేట్ వేద పాఠశాల శ్రీ వేద భారతీ పీఠంలో వివాదాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. దీంతో, వేద పాఠశాల తీరుపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్షరాభ్యాసం కోసం వచ్చే చిన్నారుల నాలుకపై బీజాక్షరాల వ్యవహారం వివాదంగా మారింది. వేద పాఠశాలలో చావు కేకలు, విద్యార్థులపై దాడులు వరుసగా ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెల 21న లోహిత్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడగా, మరో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీంతో బాసర ఆలయాన్ని అపహాస్యం చేస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Updated at - Apr 14 , 2025 | 02:50 PM