Home » Andhra Pradesh » West Godavari
సౌమ్యులు, స్నేహశీలి, ప్రజాసేవకు పరితపించే మనస్తత్వం గలవారు ఎమ్మెల్యే అంజిబాబు అని, అటువంటి వ్యక్తికి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నియమించడం శుభ పరిణామమని జాతీయ కాపు సంఘం నాయకులు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు యర్రంశెట్టి శివకృష్ణ అన్నారు.
సాఫ్ట్వేర్ రంగం మందగమనంలో ఉండడంతో ఇంజనీరింగ్ పూర్తయిన అభ్యర్థులు నిరుద్యోగులుగా మిగులుతున్నారు.
మండవల్లి మండలం గన్నవరంలో శుక్రవారం రాత్రి తల్లి, కొడుకు దారుణ హత్యకు గురయ్యారు.
క్రీడలతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందవచ్చని, యువత క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి సూచించారు.
ఉన్నత విద్యా సంస్థలకు ఊరట లభించింది. విద్యా ర్థులకు కష్టాలు తొలగాయి. ప్రభుత్వం ఫీజు రీయింబ ర్స్మెంట్ సొమ్మును కళాశాలల ఖాతాలకే జమ చేయ నుంది. ఆ దిశగా ఉత్తర్వులు జారీచేసింది. ఐదేళ్లపాటు తల్లుల ఖాతాలో ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేశారు.
విధుల్లో అలసత్వం ప్రదర్శి స్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చ రించారు. భీమవరంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
పల్లె పండుగలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవ్వాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డ్వామా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షిం చారు.
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టి శుక్రవారం పాములపర్రు వచ్చిన సందర్భంగా ఆయనకు కూటమి నాయ కులు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పదవుల్లో పశ్చిమకు ప్రాధాన్యం కొనసాగుతోంది. తాజాగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, సభ్యుడిగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్ని కయ్యారు.
జిల్లాలో ధాన్యం దిగుబడులు అధికం. ఖరీఫ్లో సగటున 40 బస్తాలు, రబీలో 55 నుంచి 60 బస్తాలు దిగుబడి వస్తుంది. అయితే ఈ ధాన్యం కొనుగోలు విషయంలో గత ఏడాది రబీ నుంచి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది.