Home » ABN Andhrajyothy Effect
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని ఈ వైయస్ జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తాజాగా రుజువులతో సహా బహిర్గతం చేసింది. దీంతో జగన్ ప్రభుత్వం ఆగమేఘాల మీద దిగిచ్చింది. అందుకు సంబంధించిన సీడీఎంఏ వెబ్‌సైట్‌ని చాలా సైలెంట్‌గా మూసివేసింది.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 ప్రారంభంకానున్న వేళ లక్నోసూపర్ జెయింట్స్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ మార్కు వుడ్ దూరం కావడంతో లక్నో ఇబ్బందుల్లో పడింది. తాజాగా మరో ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లీ కూడా దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో డేవిడ్ విల్లీ ఐపీఎల్ తొలి భాగం నుంచి తప్పుకున్నాడు.
ధరణి పోర్టల్‌ను గత ప్రభుత్వం అనుకూలంగా మార్చుకుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. భూదాన్ భూమి పేరుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భూమిని కొట్టేశారని వివరించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు వచ్చిన కథనం అక్షర సత్యం అని వివరించారు.
తెలంగాణను బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) దోచుకుని వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రవీంద్రనాయక్ (Ravindra Naik) ఆరోపించారు. కేసీఆర్ చేసిన తప్పులపై సీబీఐ, ఈడీ చేత విచారణ జరపాలని కోరుతూ రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి , ఈడీ, సీబీఐ డైరెక్టర్లకు లేఖ రాశానని చెప్పారు.
నేడు మేషం రాశివారు పూర్వ మిత్రులను కలుసుకుంటారు. పెట్టబడులు లాభిస్తాయి. పన్నులు, బీమా పథకాల చెల్లింపులకు నిధులు సర్దుబాటవుతాయి. రుణాలు మంజూరవుతాయి. మెడికల్ క్లెయిముల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వైసీపీ పాలనను బొందపెడతారని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra) హెచ్చరించారు.
నగరంలోని ఐఎస్‌సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాఘవేంద్ర హోటల్లో షాట్ సర్క్యూట్ జరిగింది. దాంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటినా ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కిందట మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే బస్సుల్లో సీటు కోసం పలువురు మహిళలు గొడవలకు దిగుతున్నారు. ఈ పథకం ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో తరచూ ఇలాంటి గొడవలు జరుగుతునే ఉన్నాయి.
2023 సంవత్సరం ఇక ముగిసినట్టే. ఈ సంవత్సరం ముగియడానికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. మరికొన్ని గంటల్లోనే ఈ ఏడాదికి శుభం కార్డు పడనుంది. 2023 సంవత్సరం ముగిసిందనే బాధను కళ్లలో నింపుకుని, కొత్త సంవత్సరం 2024 రాబోతుందనే సంతోషకరమైన మోహంతో అందరూ కనిపించనున్నారు.
రష్యాలో జననాల రేటు రోజు రోజుకు తగ్గిపోతుంది. జనాభా శాస్త్రవేత్త విక్టోరియా సాకేవిచ్ ప్రకారం జననాల రేటు తగ్గడం ఆందోళనకు గురి చేస్తోంది. 1990ల నుంచి రష్యాలో అబార్షన్ రేటు దాదాపు పదిరెట్లు పడిపోయింది.