ABN Andhrajyothy: ఏబీఎన్‌పై కుట్ర.. లైవ్ ఫ్రీక్వెన్సీ హ్యాక్.. ఇది ఆ ఛానెల్ పనేనా?

ABN, Publish Date - Jul 24 , 2024 | 06:26 PM

ఒకే రంగానికి చెందిన వ్యక్తులు లేదా సంస్థల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. అన్నింటిలోనూ తామే ముందుండాలని, అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని.. కసిగా దూసుకెళ్తుంటారు. అయితే..

ఒకే రంగానికి చెందిన వ్యక్తులు లేదా సంస్థల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. అన్నింటిలోనూ తామే ముందుండాలని, అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని.. కసిగా దూసుకెళ్తుంటారు. అయితే.. ఎంత పోటీ ఉన్నప్పటికీ ఒకరి పనిలో మరొకరు జోక్యం చేసుకోరు. తమ సొంత ప్రతిభను ప్రదర్శిస్తూ.. ఇతరుల కన్నా ఒక మెట్టు ఎత్తులోనే ఉండాలని భావిస్తారు. కానీ.. కొందరు మాత్రం తప్పుడు మార్గాలను అనుసరిస్తుంటారు. తాము ఎలా ఎదగాలన్న విషయంపై దృష్టి పెట్టకుండా.. అవతలి వారిని కిందకు లాగేందుకు కుట్రలు పన్నుతుంటారు. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) న్యూస్ ఛానెల్‌పై కూడా అలాంటి కుట్రే జరిగింది. మా ఛానెల్‌ను దెబ్బ కొట్టేందుకు.. లైవ్ ఫ్రీక్వెన్సీ హ్యాకింగ్‌కు పాల్పడ్డారు.


లైవ్ ఫ్రీక్వెన్సీ హ్యాక్

బుధవారం మధ్యాహ్న సమయంలో గుర్తు తెలియని ఓ ఛానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి శాటిలైట్ క్రెడెన్షియల్‌ను తస్కరించింది. ఏబీఎన్ డీఎస్ఎన్‌జీ ఫ్రీక్వెన్సీని కాపీ చేసినట్లు తేలింది. 1.5 మెగా హెర్ట్జ్ కెరీర్‌కు సంబంధించిన ఫ్రీక్వెన్సీని తస్కరించినట్లు తెలియడంతో.. టెక్నికల్ మేనేజర్ వీరభద్రరావు వెంటనే కేంద్ర సమాచార హక్కుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర సమాచార శాఖ, ఇస్రో.. విచారణ జరుపుతున్నామని తెలిపాయి. ఈ అంశంపై న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌కు కూడా ఫిర్యాదు చేయగా.. వారు స్పందించి విచారణ చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాలు ఇంకా జరుగుతున్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు కేంద్ర సమాచార శాఖ తెలిపింది.

Updated at - Jul 24 , 2024 | 06:26 PM