Home » ACB
ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు.. తెలియదు అన్న సమాధానాలు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచటం కోసం తాము కృషి చేస్తే ఇప్పుడు రంధ్రాన్వేషణ ఏమిటంటూ నిలదీత.. అడిగిన ప్రశ్నలే మళ్లీ ఎన్నిసార్లు అడుగుతారు?
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌పై ఏసీబీ విచారణ ఈరోజు ముగిసింది. గత కొన్ని వారాలుగా కీలక పరిణామాల నడుమ కేటీఆర్ ఎట్టకేలకు ఏసీబీ ఎదుట హాజరయ్యారు.
Telangana: ఫార్ములా ఈ కేసు రేసులో విచారణ సందర్భంగా పలు కీలక ప్రశ్నలను కేటీఆర్ ముందు ఉంచారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపైనే వరుసగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి మళ్లింపుపై కేటీఆర్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు గంటకుపైగానే విచారిస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు కేటీఆర్‌ను విచారణ జరిపి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేయనున్నారు. మరోవైపు న్యాయవాది సమక్షంలో విచారణ జరిగేలా బుధవారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. అంటే కేటీఆర్ విచారణ గదిలో ఉంటే.. ఆయన తరఫు న్యాయవాది లైబ్రరీలో కూర్చునే విధంగా ఏసీబీ అధికారులు ఏర్పాటు చేశారు.
E Car Race Scam: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణకు గురువారం ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నారు. విచారణ తర్వాత కేటీఆర్ ఇంటికి వెళతారా? లేక అరెస్టవుతారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో)కు నిధుల చెల్లింపు విషయంలో తాను నిమిత్తమాత్రుడినేనని హెచ్ఏండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి.. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులతో అన్నట్లు తెలిసింది.
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారమంతా నాటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అప్పట్లో ఆ శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరించిన అర్వింద్ కుమార్.. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.
Telangana: ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను దాదాపు మూడు గంటలుగా ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల మళ్లింపుకు సంబంధించే ఏసీబీ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
మచిలీపట్నంలోని గ్రీన్కో కార్యాలయం, గ్రీన్కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
ACB RAIDS: ఫార్ముల ఈ కార్ రేసు కేసుకు సంబంధించి అధికారులు తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఏపీలోని మచిలిపట్నంలోనూ అధికారులు సోదాలు చేశారు. పలు కీలక డ్యాంకుమెట్లనూ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.