Home » Adilabad
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపో వద్దని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కిష్టంపేట, కత్తెరసాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ చెల్లిస్తుందని పేర్కొన్నారు.
పాత మంచిర్యాల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం మహా మండల పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు నరహరి శర్మ ఆధ్వ ర్యంలో అయ్యప్ప అభిషేకంతోపాటు పడిపూజ నిర్వహించారు. అనం తరం అయ్యప్ప స్వాములు గ్రామంలో నగర సంకీర్తన చేశారు.
బహిర్భూమి కోసం గ్రామ శివార్లోకి వెళ్లిన మహిళపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డెడ్రా గ్రామంలో జరిగింది.
జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన హిందూ శ్మశాన వాటిక పనులు వేగం పుంజుకున్నాయి. గోదావరి సమీపంలోని భూధాన్ యజ్ఞ బోర్డు భూముల్లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4 కోట్ల అంచనాతో నిర్మాణం చేపట్టగా, అక్టోబర్ 3న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు శంకుస్థాపన చేశారు.
మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి అగుపించడం లేదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శనివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.164 కోట్లతో నిర్మించ తలపెట్టిన గోదావరిపై అంతర్గాం వంతెన ఊసే లేదని, నిర్మించిన ఇంటి గ్రేటెడ్ మార్కెట్, ఐబీ గెస్ట్‌హౌజ్‌ను లేకుండా చేశాడన్నారు.
గురుకులాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచి కామన్ మెనూను ప్రారంభించిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ప్రభు త్వం ప్రవేశపెట్టిన కామన్ డైట్ మెనూను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు.
రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందని, ఏడు బెంచీలను ఏర్పాటు చేశామన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. శనివారం నియోజకవర్గ సంస్ధాగత ఎన్నికల సమావేశంలో మాట్లా డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.
కుటుంబ సమస్యలు... ఆర్థిక ఇబ్బందులు... అనారోగ్య సమస్యలు... ప్రేమ విఫలమైందని...స్టాక్ మార్కెట్లో నష్టం వచ్చిందని.. ఇలా రకరకాల కారణాలతో మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విలువైన జీవితాలను విషాదంగా ముగిస్తున్నారు.. సమస్య ఏదైనా చావే పరిష్కారమని ఆలోచిస్తూ నెల రోజుల వ్యవధిలో 20 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆహార నాణ్యతలో విద్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి యాదయ్య ఆదేశించారు. శుక్రవారం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి వంటశాల గదులు, కూరగాయల నిల్వ వంట సామగ్రిని పరిశీలించారు.