కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Dec 15 , 2024 | 10:23 PM
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపో వద్దని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కిష్టంపేట, కత్తెరసాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ చెల్లిస్తుందని పేర్కొన్నారు.

చెన్నూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపో వద్దని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కిష్టంపేట, కత్తెరసాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ చెల్లిస్తుందని పేర్కొన్నారు.
జిల్లాలో 326 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, 315 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. తేమ శాతం, సాలు, మట్టి గడ్డలు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రా లకు తీసుకరావాలన్నారు. కేంద్రాల్లో నీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇతర సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. గన్ని సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచామన్నారు. తహిసీల్దార్ మల్లికార్జున్, తదితరులున్నారు.