Home » Afghanistan Cricketers
వాట్ ఏ మ్యాచ్! హైడ్రామా, సస్పెన్స్, సంబరాలు, భావోద్వేగాలతో పాటు వరుణుడి దోబూచులాట.. వెరసి అఫ్ఘాన్ సేన సగర్వంగా తలెత్తుకునేలా, అంతులేని ఆనందంతో ముగిసిన ఈ పోరు.. ఏ మసాలా సినిమాకూ తీసిపోని మలుపులతో సాగింది. సెమీస్ బెర్త్ కోసం బంగ్లాదేశ్‌తో గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో అఫ్ఘాన్ చేసింది
టీ20 ప్రపంచకప్‌లో పసికూన అఫ్గానిస్తాన్ మరో సంచలన విజయం నమోదు చేసింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన అఫ్గాన్ టీమ్ తాజాగా సూపర్-8లో ఏకంగా ఆస్ట్రేలియానే చిత్తు చేసింది. ఈ విజయంతో సెమీస్ రేస్‌ను అఫ్గాన్ ఆసక్తికరంగా మార్చింది. తమ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
అఫ్గాన్‌తో జరిగిన టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) పోరులో ఇండియా ఘన విజయం సాధించింది. అయితే గెలుపొందిన ప్రతీసారి డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే బెస్ట్ ఫీల్డర్ మెడల్(Best Fielder Medal) ఈ సారి ఎవరికి దక్కుతుందోననే ఆసక్తి అందరికీ ఉండింది.
మహ్మద్ నబీ ప్రపంచ నంబర్ 1 వన్డే ఆల్ రౌండర్ అయ్యాడు. ఐదేళ్ల పాటు షకీబ్ అల్ హసన్ పేరిట ఉన్న రికార్డును కొల్లగొట్టాడు.
India vs Afghanistan: భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం మొదటి మ్యాచ్ జరగనుంది. మొహాలీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ముందు పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా ఆడే చివరి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడం గమనార్హం.
Naveen-ul-Haq retirement: అప్ఘానిస్థాన్ స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా చాలా కెరీర్ ఉన్నప్పటికీ 24 ఏళ్ల చిన్న వయసులోనే వన్డేల నుంచి రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సౌతాఫ్రికాతో అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ ముగిశాక రిటైర్మెంట్ నిర్ణయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించాడు.
ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెయిన్ మాక్స్‌వెల్ అద్భుతం చేశాడు. అద్భుతం కూడా కాదు. మహాద్భుతం చేశాడనే చెప్పుకోవాలి. అఫ్ఘానిస్థాన్ విసిరిన 292 పరుగుల లక్ష్య చేధనలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఓటమి అంచున నిలిచింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్ అంచనాలకు మించి రాణిస్తోంది. పెద్ద పెద్ద జట్లను చిత్తుగా ఓడించి సంచలన విజయాలు సాధించిన అప్ఘానిస్థాన్ జట్టు ఎవరూ ఊహించని రీతిలో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది.
భారత్ వేదికగా ఆసక్తికరంగా సాగుతున్న వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలు ముగింపునకు చేరుకున్నాయి. జట్లన్నింటికీ మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా జట్లకు సెమీస్ బెర్త్‌లు కూడా ఖరారు అయ్యాయి.