Home » Amaravati farmers
సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan reddy) తప్పుడు నిర్ణయం భస్మాసుర హస్తంగా మారిందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్న శపథం చేశారు. అమరావతి ఉద్యమానికి 1300 రోజులు పూర్తయిన సందర్భంగా రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నాలుగేళ్ల నరకంలో నవ నగరం పేరిట మందడంలో చేపట్టిన కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్ష నేతలు పాల్గొన్నారు. అమరావతి రైతులకు తెలంగాణ రైతులు మద్దతు తెలిపారు.