Amaravati Farmers: సీఎం తప్పుడు నిర్ణయం భస్మాసుర హస్తం: రాజధాని రైతులు
ABN , First Publish Date - 2023-07-09T15:01:26+05:30 IST
సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan reddy) తప్పుడు నిర్ణయం భస్మాసుర హస్తంగా మారిందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్న శపథం చేశారు. అమరావతి ఉద్యమానికి 1300 రోజులు పూర్తయిన సందర్భంగా రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నాలుగేళ్ల నరకంలో నవ నగరం పేరిట మందడంలో చేపట్టిన కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్ష నేతలు పాల్గొన్నారు. అమరావతి రైతులకు తెలంగాణ రైతులు మద్దతు తెలిపారు.
అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan reddy) తప్పుడు నిర్ణయం భస్మాసుర హస్తంగా మారిందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్న శపథం చేశారు. అమరావతి ఉద్యమానికి 1300 రోజులు పూర్తయిన సందర్భంగా రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నాలుగేళ్ల నరకంలో నవ నగరం పేరిట మందడంలో చేపట్టిన కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్ష నేతలు పాల్గొన్నారు. అమరావతి రైతులకు తెలంగాణ రైతులు మద్దతు తెలిపారు.
సేవ్ అమరావతి- బిల్డ్ అమరావతి పేరుతో రైతులు నినాదాలు చేశారు. అరెస్టులు, కుట్రలతో రాజధాని నిర్మాణం ఆపలేరని రైతులు దీమా వ్యక్తం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ చేశారు. అమరావతి ఉద్యమం మరింత ఉద్దృతం చేస్తామన్న జగన్ సర్కార్‌ను హెచ్చరించారు.