Share News

Amrapali: వరద నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలి..

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:14 PM

వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరద నిలువకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులను ఆదేశించారు. అడిషనల్‌, జోనల్‌ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్‌వోడీలతో ఆమె టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Amrapali: వరద నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలి..

- కమిషనర్‌ ఆమ్రపాలి

హైదరాబాద్‌ సిటీ: వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరద నిలువకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులను ఆదేశించారు. అడిషనల్‌, జోనల్‌ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్‌వోడీలతో ఆమె టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వర్షాల సమయంలో నీరు నిలిచే చోట శాశ్వత పరిష్కారం చూపాలని, ఇంజనీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక అందజేయాలని సూచించారు. విద్యుత్‌ కనెక్షన్‌ కమర్షియల్‌గా ఉండి, రెసిడెన్షియల్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్న యజమానులకు నోటీసులు జారీచేసి ట్యాక్స్‌ రివిజన్‌ చేపట్టాలన్నారు.

ఇదికూడా చదవండి: Jaggareddy: లడ్డు వివాదం వెనక ఉంది బీజేపీనా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు


నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ఆదేశించారు. మరో సమీక్షలో నగరంలో కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కమిషనర్‌ సూచించారు. వైద్యారోగ్యశాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని..యాంటీ లార్వల్‌, ఫాగింగ్‌ విస్తృతం చేయాలని పేర్కొన్నారు.

ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన

వర్షాల నేపథ్యంలో కమిషనర్‌ ఆమ్రపాలి ఎల్బీనగర్‌ జోన్‌లోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. శానిటేషన్‌ నిర్వహణ, రోడ్లపై పాట్‌హోల్స్‌ తదితర వాటిని పరిశీలించారు. సరూర్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌, నాగోల్‌ రోడ్‌ మీదుగా ఉప్పల్‌ భగాయత్‌, ఉప్పల్‌ స్టేడియం రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్డు మరమ్మతులు, శానిటేషన్‌పై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.


........................................................

ఈ వార్తను కూడా చదవండి:

.......................................................

Hyderabad: వామ్మో.. హోటల్‌ భోజనంలో జెర్రి!

హైదరాబాద్: ఆబిడ్స్‌ తాజ్‌మహల్‌ హోటల్‌(Abids Taj Mahal Hotel)లో భోజనం చేస్తోన్న ఓ వినియోగదారుడి ప్లేట్‌లో జెర్రి ప్రత్యక్షమైంది. అశోక్‌కుమార్‌ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఆ హోటల్‌లో అన్నం తింటుండగా పప్పులో జెర్రి కనిపించడంతో ఆందోళనకు గురై విషయాన్ని హోటల్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. పాలకూరలో జెర్రి వచ్చినట్టుంది.. ఏం కాలేదు కదా.. అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని అశోక్‌ తెలిపారు. మేం కూడా ఉదయం పప్పు తిన్నాం.. మాకు ఏం కాలేదు.. ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని వినియోగదారులతో వాగ్వాదానికి దిగారు.

city9.jpg


city8.jpg

జెర్రి ఉన్న పప్పు గిన్నెను లాక్కుని బయట పడేశారు. జెర్రి వచ్చిన విషయం తెలిసి అప్పటికే భోజనం ఆర్డర్‌ చేసిన వారు పప్పు తినలేదు. హోటల్‌ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో అశోక్‌ ఆన్‌లైన్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం హోటల్‌ను తనిఖీ చేసిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పప్పు నమూనా సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. కిచెన్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో అపరిశుభ్రత ఉందని గుర్తించారు. హోటల్‌కు నోటీసులు జారీ చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు.


ఇదికూడా చదవండి: మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ఇదికూడా చదవండి: రేవంత్‌రెడ్డి.. కోర్టుకు రండి!

ఇదికూడా చదవండి: తెలంగాణలో రేవంత్‌ కుటుంబం దోపిడీ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2024 | 12:20 PM