Home » AP Police
Andhrapradesh: విజయవాడలోని ఓ హోటల్లో ఉన్న ముంబై నటి జిత్వానీ నుంచి పోలీసులు స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. ఇప్పటికే విచారణాధికారి స్రవంతి రాయ్ హోటల్‌కు చేరుకున్నారు. విచారణ సమయంలో నటి కన్నీళ్లు పెట్టుకున్నారు. జిందాల్‌పై అత్యాచారం కేసు నుంచి వరుసగా జరిగిన ఘటనలు వివరించినట్లు సమాచారం.
నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సిబ్బందిని ఆదేశించారు.
మండల సరిహద్దు ప్రాంతమైన టి.పసలవాండ్లపల్లె, మర్రిపాడు, శెట్టివారిపల్లె, సంగసముద్రం, తరిగొండ, నడిమిఖండ్రిగ అటవీ ప్రాంతాల్లో జూదం విచ్చలవిడిగా సాగుతోంది.
అక్రమంగా కేసులు బనాయించి వేధించిన వారిపై చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత హెచ్చరించారు. ముంబయి సినీ నటి కాదంబరి జత్వాని కేసుపై ఆమె స్పందించారు. నటి కాదంబరి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మట్కా, గంజాయిలపై ఉక్కుపాదం మోపుతామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలు, ఎన్డిపిఎస్ కేసులతో పాటు ఇటీవల జరిగిన పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించిన కేసుల దర్యాప్తుపై సమీక్ష చేశామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనం కేసులో సీఐడీ అధికారులు రెండోరోజు మంగళవారం కూడా విచారణ కొనసాగించారు. సోమవారం రాత్రి సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆఽధ్వర్యంలో సీఐడీ అధికారులు సబ్‌కలెక్టరేట్‌లో విచారణ చేశారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎ్‌సఐ షణ్ముగాన్ని ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం సస్పెండ్ చేశారు.
తిరుపతిలో పోలీసులు దాదాపు 50 లక్షల విలువ చేసే లిక్విడ్ గంజాయిని గురువారం మధ్యాహ్నం ఓ కారుతోపాటు స్వాధీనం చేసుకున్నారు.
వైసీపీ నేత జోగి రమేష్ బుధవారం మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన పోలీస్ విచారణ అనంతరం సర్కిల్ కార్యాలయం నుంచి జోగి రమేశ్ సైలెంట్‌గా బయటకు వెళ్లిపోయారు. మీడియాతో సైతం ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ రోజు జరిగిన పోలీస్ విచారణకు తన తరఫు న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, విజయవాడ నగరానికి చెందిన వైసీీపీ నేత పి. గౌతంరెడ్డితో కలిసి జోగి రమేశ్ మంగళగిరి సర్కిల్ కార్యాలయానికి వచ్చారు.