Home » Bail
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల బాధితురాలిని అపహరించారనే కేసులో ఆయన తండ్రి, జనతాదళ్ సెక్యులర్ నేత, హోలెనర్సిపుర ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ సోమవారంనాడు మంజూరు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కి సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తనపై హనుమంతుడి ఆశీర్వాదం ఉందని.. జైలు నుంచి బయటకి వచ్చాక కేజ్రీ వ్యాఖ్యానించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లు, మెస్ మూసివేతపై నకిలీ సర్క్యులర్ వైరల్ చేసిన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్‌పై విడుదలయ్యారు. చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న క్రిశాంక్ కు న్యాయస్థానం షరతులో కూడిన బెయిర్ మంజూరు చేసింది.
మద్యం విధానం కేసులో యాభై రోజులుగా తిహాడ్ జైల్లో మగ్గుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు ఐదు షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల తుది దశ జూన్ 1న ముగియనున్న నేపథ్యంలో.. జూన్ 2వ తేదీన లొంగిపోవాలని స్పష్టం చేసింది.
మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. జూన్ 1వ తేదీ వరకూ ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు ఆయనను సాయంత్రం విడుదల చేశారు.
లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉండగా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. పలు షరతుల మీద కేజ్రీవాల్‌కు జూన్ 1వ తేదీ వరకూ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
డిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహాడ్ జైల్లో ఉన్నారు. ఆ క్రమంలో బెయిల్ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది..
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు(Kejriwal) సుప్రీంకోర్టులోనూ(Supreme Court) నిరాశే ఎదురైంది. కేజ్రీవాల్‌కు అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు. ఈడీ(ED) అరెస్ట్‌పై కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈ అరెస్ట్ ఛాలెంజ్ పిటిషన్‌ను ఏప్రిల్ 29న విచారిస్తానని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై కారణాలు తెలపాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రఘురామ పిటిషన్ల పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది.