Home » Bengaluru
నటి హేమ(Actress Hema)పై మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తేసింది. బెంగళూరు రేవ్ పార్టీ(Bengaluru Rave Party) వ్యవహారంలో హేమపై మా కమిటీ గతంలో బ్యాన్ విధించింది.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్‌కు అనుమతించిన గవర్నర్ తీరును ఆక్షేపిస్తూ తీర్మానం తీసుకున్నామని, ఎమ్మెల్యేలంతా సీఎంకు అండగా ఉంటారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) వెల్లడించారు.
బీజేపీ, జేడీఎస్ నాయకులపై నమోదైన నాలుగు పాత కేసులను తెరపైకి తేవాలని కర్ణాటక మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
బెంగళూర్ వీధుల్లో ఓ బౌన్సర్ రచ్చ రచ్చ చేశాడు. ఓ కారు డ్రైవర్‌కు చుక్కలు చూపించాడు. పక్కన జనం ఉన్నా.. సెక్యూరిటీ సిబ్బంది ఉన్న ఏ మాత్రం వినిపించుకోలేదు.
ఐటీ హబ్ బెంగళూర్‌లో ఆకతాయిల వల్ల వాహనదారులు తెగ ఇబ్బంది పడుతున్నారు. కొందరు రోడ్ల మీద స్టంట్లు చేస్తున్నారు. ఆ స్టంట్లను వీడియో తీయడం.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఆకతాయిలను పట్టుకొని మరీ బుద్ది చెబుతున్నారు పోలీసులు. తాజాగా మరికొందరు ఇలానే చేశారు. వారందరిని పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేశారు.
వైయస్ఆర్ సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి నుంచి బెంగళూరుకు షటిల్ సర్వీస్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు పక్కన పెట్టారు. దీంతో అధికారం దూరమైన జస్ట్ 60 రోజుల్లో వైయస్ జగన్ దాదాపు 6 సార్లు... తాడేపల్లి నుంచి బెంగళూరుకు ప్రయాణం కట్టారని సమాచారం.
బెంగళూరులోని సిటీ కాలేజీలో బాధితురాలు డిగ్రీ చివర సంవత్సరం చదువుతుందని ఈస్ట్ జోన్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమణ్ గుప్తా వెల్లడించారు. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి.. ఆమెపై నేరపూరితంగా దాడి చేశాడని తెలిపారు. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేశారని ఏసీపీ వివరించారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మండిపడ్డారు. ఈ కేసును చట్టబద్ధంగా తాము ఎదుర్కొంటామని, అందుకు అవసరమైన సన్నాహకాలు చేశామని చెప్పారు.
రిటైర్మెంట్ తర్వాత పుట్టిన తేదీ మార్పు సాధ్యం కాదని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంజీఎస్ కమల్ ఏకసభ్య ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది.
రోజు రోజుకు కొందరు మనుషుల బుద్ధి మరింత గలీజ్‌గా తయారవుతోంది. కామంతో కన్ను మిన్ను కానక వ్యవహరిస్తున్నారు. తాజాగా బెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ షాపులో పని చేసే ఉద్యోగి చెండాలమైన పని చేశాడు.