Home » CBI Court
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి.. తీహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితకు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ స్పెషల్ కోర్టు సోమవారం నిరాకరించింది. అందుకు సంబంధించి.. తన తీర్పులో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా కీలక అంశాలను ప్రస్తావించారు.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై పదేళ్లుగా విచారణ జరుగుతుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌ను రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం (రేపు) విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టైన సంగతి తెలిసిందే. కవితను ఈడీ పలుమార్లు విచారించి మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కవిత జైలులో ఉండగానే సీబీఐ అధికారులు కవితను ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా విచారణ చేపట్టనున్నారు. లిక్కర్ పాలసీ ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ కోరుతున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు.
లిక్కర్ కేసులో సీబీఐ వాదనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితది కీలకపాత్ర అని సీబీఐ చెబుతోంది. సౌత్ గ్రూప్‌నకు చెందిన వ్యాపారవేత్త సీఎం కేజ్రీవాల్‌ను కలిశారని తెలిపింది. లిక్కర్ బిజినెస్‌కు సహకరిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారన్నారు. లిక్కర్ వ్యాపారులను సీఎం కేజ్రివాల్‌కు కవిత కలిపారని సీబీఐ తరుఫు లాయర్ కోర్టుకు తెలిపారు.
న్యూఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహాడ్ జైల్లో ఉన్నారు. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న తనకు జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.
వివేక హత్య కేసులో (Viveka Murder Case) అప్రూవర్‌గా మారిన దస్తగిరిని మరోసారి ప్రలోభానికి గురిచేశారు. సీబీఐ(CBI) ఎస్పీ రామ్ సింగ్ కొట్టి అప్రూవర్‌గా మార్చాడని చెప్పాలంటూ తీవ్ర ఒత్తిడి చేశారు. అలా చెబితే ఏకంగా రూ.20 కోట్లు అడ్వాన్స్‌గా ఇస్తామంటూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఆఫర్ చేశారు. దస్తగిరి జైలులో ఉన్న సమయంలో చైతన్య రెడ్డి డాక్టర్‌గా వెళ్లి జైల్లో ప్రలాభాలకు గురిచేశాడని సీబీఐ కోర్టుకు దస్తగిరి వెల్లడించాడు.