Viral Video: నడి రోడ్డుపై పోలీస్ భార్య డ్యాన్స్.. సీన్ కట్ చేస్తే..
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:17 PM
Cop Wife Dance: జ్యోతి సెక్టార్ 20 గురుద్వారా చౌక్‌లోని రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డు మీద ఉన్న జీబ్రా క్రాసింగ్‌పై డ్యాన్స్ చేసింది. జ్యోతి మరదలు ఆ డ్యాన్స్‌ను వీడియో తీసింది. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే పిచ్చితో కొంతమంది బరి తెగించేస్తున్నారు. పిచ్చి పలు రకాలు అన్నట్లు.. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ.. ఇష్టం వచ్చినట్లు చేసేస్తున్నారు. వీడియోల పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా లేకపోలేదు. తాజాగా, భార్య చేసిన పనికి ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇబ్బందుల్లో పడ్డాడు. భార్య నడిరోడ్డుపై డ్యాన్సులు చేయటంతో.. ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌ను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేసేశారు. భార్య చేసిన తప్పుకు.. భర్త ఉద్యోగం తీసేయటం ఏంటి? అన్న అనుమానం మీకు రావాలి. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం పోవడానికి ఓ ట్విస్ట్ కారణం. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవడానికి పూర్తి స్టోరీ చదవాల్సిందే.
ఆ వివరాల్లోకి వెళితే.. చంఢీఘర్‌కు చెందిన అజయ్ కుందు, జ్యోతి భార్యాభర్తలు. అజయ్ పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మార్చి 20వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు జ్యోతి సెక్టార్ 20 గురుద్వారా చౌక్‌లోని రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డు మీద ఉన్న జీబ్రా క్రాసింగ్‌పై డ్యాన్స్ చేయటం ప్రారంభించింది. జ్యోతి డ్యాన్స్ చేస్తూ ఉంటే.. ఆమె మరదలు పూజ వీడియో తీస్తూ ఉంది. జ్యోతి అలా రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డ్యాన్స్ చేయటం అయిపోగానే ఇద్దరూ ఇంటికి వెళ్లిపోయారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ జస్బిర్ సెక్టార్ 34లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. జ్యోతి, పూజలను అరెస్ట్ చేశారు. అజయ్ కుందును సస్పెండ్ చేశారు. దీనికి కారణం ఏంటంటే.. జ్యోతి, పూజలు ఆ వీడియోను అజయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. అదే అతడి పాలిట శాపం అయింది. అరెస్టయిన కొద్దిసేపటికే జ్యోతి, పూజలు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక, భార్య చేసిన పనికి అజయ్‌ను విధుల్లోంచి తొలగించటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భార్య తప్పు చేస్తే.. అతడ్ని సస్పెండ్ చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Bank Holiday: కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు.. ఈ రోజు బ్యాంకులకు సెలవా..
Stock Market Updates: భారీగా పడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు