Home » Chandrababu Naidu
కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు సింగపూర్ తెలుగు ఫోరం ఆర్థిక సాయం అందించింది.
పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని, పేదలకు కడుపునిండాఅన్నంపెడితే అదే మానసిక సంతృప్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం పార్కులో అన్నక్యాంటీన్ను గురువారం ఆయన ప్రారంభించారు. సీఎం సతీమణి భువనేశ్వరి ప్రజలకు భోజనం వడ్డించారు.
సీఎం చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలకు ఎలాంటి కండీషన్లు ఉండవని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అనవరమైన నిబంధనలతో సంక్షేమ కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లో కోత పెట్టబోమన్నారు.
‘ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే’ అన్నది సూపర్ స్టార్ రజినీకాంత్ ‘బాషా’లోని ఓ ఫేమస్ డైలాగ్. ‘వంద మంది ఆర్టీఐ దరఖాస్తులు పెట్టుకున్నా... ఒక్కదానికీ జవాబు చెప్పం’ అన్నది రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ బాషా తీరు! వైసీపీ హయాంలో ‘సమాచార హక్కు చట్టం’ ఉండీ లేనట్లుగా తయారైంది.
ఐదేళ్ళ వైసీపీ పాలనలో సామాన్యుడు ఎన్నో కష్టాలు పడ్డాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఎల్లుండి నుండి వంద అన్న క్యాంటీన్లలో ఆహారం సిద్దంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులోని చుట్టగుంటలో అన్నక్యాంటీన్ ఏర్పాటు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అందుకు సంబంధించిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మందుబాబులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త మద్యం బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. అందులోభాగంగా కొత్త మద్యం పాలసీ.. ప్రొక్యూరిమెంట్ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు జరుపుతుంది. ఆ క్రమంలో మద్యం కొనుగోళ్ల పాలసీపై మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.
జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తమ పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గత ఐదేళ్లూ ఉపాధి హామీ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో కేంద్ర అధికారుల వద్ద మన అధికారులు తలవంచుకోవాల్సిన పరిస్థితి!
చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తెలుగుదేశంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. నీతి నిజాయితీలకు మారు పేరుగా నిలిచారు. అలాగే సమర్థవంతమైన నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు.