Home » China
భారత్‌కు కొత్త రాయబారిని చైనా నియమించునుంది. అయితే ఈ నియామకంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. 15 నెలల తర్వాత భారత్‌కు చైనా తమ రాయబారిని నియమించనుండటం ఇదే ప్రథమం. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకోనుంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ భారత పర్యటనతో చైనా అప్రమత్తమైంది. భారత్ - ఫ్రాన్స్ మధ్య సంబంధాలు బలపడుతున్న తరుణంలో మాక్రాన్‌ను తన వైపు తిప్పుకునేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్(Xi Jinping) కుయుక్తులు పన్నుతున్నారు.
తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకోవడానికి వ్యాపారులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వినియోగదారులను ఆకర్షించడానికి పలు ఆఫర్లను ప్రకటిస్తుంటారు. అయితే చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్లు విచిత్రమైన మార్కెటింగ్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు.
విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజాగా ఇలాంటి ఘటన చైనా(China)లో వెలుగులోకి వచ్చింది. చెంగ్డూ నుంచి బీజింగ్ వెళ్తున్న ఓ విమానంలో తల్లిదండ్రులు తమ కుమారుడితో కలిసి ప్రయాణిస్తున్నారు. వారిద్దరు ఫస్ట్ క్లాస్‌లో టికెట్లు బుక్ చేసుకోగా.. పిల్లాడికి వేరే చోట టికెట్ బుక్ చేశారు.
Viral News: మరికొద్ది రోజుల్లో కొడుకు పెళ్లి.. తన ఇంటికి వచ్చే కోడలికి అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు ఆ మామ. ఇంకేముంది నేరుగా జ్యూవెలరీ షాప్‌కి వెళ్లి కోట్ల విలువ జేసే ఖరీదైన డైమండ్ రింగ్ చూశాడు. బాగా నచ్చింది. దానిని నేచురల్ లైట్లో ఫోటో తీసుకోవడానికి కిటికీ వద్దకు తీసుకెళ్లగా.. అదికాస్తా జారి పడిపోయింది. కింద పడితే ప్రాబ్లమ్ లేదు.. కానీ, అది తొమ్మిది అంతస్థుల నుంచి జారి డ్రైనేజీలో పడిపోయింది. దీంతో..
సోమవారం అర్ధరాత్రి తర్వాత చైనాలో భూకంపం సంభవించింది. చైనాలోని దక్షిణ జిన్యాంగ్ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. భూకంప కేంద్రం 80 కిలో మీటర్ల లోతులో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది.
చైనాలోని పర్వత ప్రాంతమైన యునాన్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది మృత్యువాత చెందారు.
చైనీయులకు ఇదేం మాయరోగమో తెలీదు కానీ.. ప్రాణాంతకమైన వైరస్ల జోలికే వెళ్తుంటారు. దానిపై పరిశోధనలు చేసేదాకా ఊరికే ఉండరు. ఇప్పుడు మరో డెడ్లీ వైరస్‌పై ఆ చైనీయులు ప్రయోగాలు చేస్తున్నట్టు ఒక అధ్యయనం వెల్లడించింది. ఆ వైరస్ పేరు ‘GX_P2V’ అని, ఎలుకలను 100 శాతం చంపేసే ప్రాణాంతకమైనదని బయోఆర్క్సివ్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది.
ప్రస్తుతం భారత్-మాల్దీవుల మధ్య నెలకొన్న వివాదాస్పద వాతావరణం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు భారత్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ దేశాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు.
ఓ వైపు భారత్, మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతుండగా.. మరో వైపు మాల్దీవుల దేశాధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohamed Muizzu) చైనా పర్యటన నిప్పు రాజేస్తోంది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్(Xi Jinping) ముయిజ్జుని తమ పాత మిత్రుడిగా అభివర్ణించారు.