Home » China
చాలా తక్కువ ఖర్చుతో ఛాట్ జీపీటీతో సమానమైన ఫీచర్స్‌ను అందిస్తూ తక్కువ కాలంలో సూపర్ పాపులర్ అయిన డీప్‌సీక్ యాప్‌పై ప్రపంచ దేశాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ యాప్ భద్రతా ప్రమాణాలను పాటించదని, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని అనుమానిస్తున్నాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ తాజాగా ఓ సంచలన విషయం బయటకు వచ్చింది.
చంద్రునిపైకి మానవ రహిత ప్రయోగం చేసేందుకు చైనా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చాంగే 7 మిషన్ ద్వారా ఫ్లయింగ్ డిటెక్టర్ వంటి రోబోను పంపించాలని చూస్తున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై దిగుమతి సుంకాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కెనడా, మెక్సికో, చైనాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలను ప్రకటించగా, తాజాగా ఆయా దేశాల నేతలు ఘాటుగా స్పందించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ. ఛాట్‌జీపీటీని తలదన్నేలా అతి తక్కువ ఖర్చుతో చైనా స్టార్టప్ డీప్‌సీక్ రూపొందించడం అంతటా సంచలనం సృష్టిస్తోంది. తాజా ఏఐ రేసులో భారత్ కూడా అడుగుపెట్టింది..
వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రత్యేకమైన సందర్భాల్లో వివిధ రకాల ఆఫర్లు ఇవ్వడం చూస్తుంటాం. వార్షికోత్సవాలు, పండుగల వేళల్లో బోనస్‌లు, ఇంక్రిమెంట్ల పేరుతో శుభవార్తలు చెబుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరిరవుతుంటారు. అయితే ..
2020 నుంచి నిలిచిపోయిన 'కైలాస్ మానస సరోవర్ యాత్ర' ను పునరుద్ధరించాలని ఇండియా- చైనా నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు కూడా సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి.
China Highway: పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డును నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అక్కడి అధికారులు. పంట పొలాల పైనుంచి ఆరు లైన్ల రోడ్డును నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ రోడ్డు కోసం పొలాలకు నష్టం చేకూర్చలేదు అక్కడి ప్రభుత్వం. పైగా సరికొత్త ఐడియాతో ఆ పంట పొలాల పైనుంచే హైవే నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.
పెంపుడు పిల్లి చేసిన నిర్వాకం వల్ల చైనా కు చెందిన ఓ మహిళ జీవితం తల్లకిందులైంది. ఆ మహిళ త్వరలో అందుకోవాల్సిన బోనస్‌ను చేజార్చుకుంది. ఏకంగా తన ఉద్యోగాన్నే కోల్పోయింది. చైనాలోని చాంగ్క్వింగ్ ప్రావిన్స్‌కు చెందిన 25 ఏళ్ల యువతికి పిల్లులంటే చాలా ఇష్టం. ఆమె ఇంట్లో ఏకంగా తొమ్మిది పెంపుడు పిల్లులు ఉన్నాయి.
నిషేధమున్నా మహానగరంలో చైనా మాంజా(Chinese manja) క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. నామ్ కే వాస్తేగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు పూర్తిస్థాయిలో మాంజా అందుబాటులో లేకుండా చేయడంలో విఫలమయ్యారు. దీంతో పలు కుటుంబాల్లో పండగ సంతోషం కరువైంది.
జాతీయ భద్రత దృష్ట్యా అమెరికా ప్రభుత్వం టిక్‌టాక్‌ను నిషేధించే అవకాశాలున్న నేపథ్యంలో యాప్ మస్క్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.