Home » CM Revanth Reddy
డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరగనుందని మంత్రి సీతక్క తెలిపారు. పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలని పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన సీఎం రేవంత్‌రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు. ఇక హాస్టల్ విద్యార్థులు అర్థాకళితో అవస్థలు పడాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Telangana: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు అభివృద్ది చేయనున్నారు. బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది.
తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు చూసి రాజకీయాలు వదిలేద్దామని అనుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నాని స్పష్టం చేశారు. తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టనని హెచ్చరించారు.
మూసీ పునరుజ్జీవనం దేశంలోనే అతిపెద్ద స్కామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. హైడ్రా ఒక బ్లాక్ మెయిలింగ్ టూల్ అని ఆరోపించారు. హైడ్రాతో పేద మధ్యతరగతి వారి ఇళ్లను కూల్చుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి నాడు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో హుస్నాబాద్‌లోని 100 పడుకల ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహసంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ప్రయాణ పథకం రద్దు కాబోతోందా. ఉచిత ప్రయాణ భారం ఆర్టీసీ మోయలేకపోతోందా.
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. "చీకట్లను ఛేదిస్తూ.. మార్పును ఆశిస్తూ.. వెలిగిన దీపం జన జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆశిస్తూ.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి" అని రేవంత్ ఆకాంక్షించారు.
డ్రగ్స్‌కు సంబంధించి కాంగ్రె్స-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు తెరతీశారని.. తనను డ్రగ్స్‌కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన సీఎం రేవంత్‌రెడ్డితోనే
కట్టిందేమీ లేదు.. కూల్చడాలు తప్ప.. రేవంత్‌రెడ్డి పది నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన దానికన్నా.. వాళ్ల నుంచి లాక్కున్నదే ఎక్కువని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచితమని.. బీఆర్ఎస్ పార్టీని ఖతంచేయడం ఆయన వల్ల కాదని మాజీమంత్రి టి. హరీశ్ రావు అన్నారు.