Share News

Breaking News: తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

ABN , First Publish Date - Mar 10 , 2025 | 10:11 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలు విడుదల
Breaking News

Live News & Update

  • 2025-03-10T15:27:00+05:30

    తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

    • గ్రూప్‌-1 పరీక్షలు రాసిన 21,093 మంది

    • 563 పోస్టుల భర్తీకి గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహణ

    • రేపు గ్రూప్‌-2 ఫలితాలు విడుదల

    • ఈనెల 20లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు

  • 2025-03-10T13:48:11+05:30

    రేవంత్‌కు కేటీఆర్ సవాల్

    • బీసీలపై రేంవత్ రెడ్డికి ప్రేమ ఉంటే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేయాలన్న కేటీఆర్

    • రేవంత్‌తో పాటు తాము దీక్షలో కూర్చుంటామన్న కేటీఆర్

    • మోదీపై యుద్ధానికి కలిసి వస్తామన్న కేటీఆర్

  • 2025-03-10T11:50:57+05:30

    కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    • ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చూసి మైండ్ బ్లాంక్ అయింది

    • రాజకీయంగా షాక్ లో ఉన్నా

    • నా షాక్‌ కి కాలం సమాధానం చెప్తుంది.

    • కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకుడు జెట్టి కుసుమ కుమార్‌ పేరును ఎమ్మెల్సీ కోసం ప్రతిపాదించాం

    • అనుకోకుండా ఢిల్లీకి తెలంగాణ నుంచి నేతలు రాలేదు

    • 2017 లో రాహుల్ గాంధీ సంగారెడ్డి సభ ఏర్పాట్లు నేనే చూశాను

    • నాటి కష్టాలు, రాజకీయ పరిణామాలు రాహుల్‌కు చెప్పాలనుకున్నా

    • ఇదే విషయంపై రాహుల్ గాంధీని కలిసేందుకు వచ్చాను

    • రాహుల్ గాంధీని సమయం అడిగాను

    • కుసుమ కుమార్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కకి చెప్పాను

    • తాను ఢిల్లీకి వచ్చి కుసుమ కుమార్ అంశం మాట్లాడాలనుకున్నా

    • సీఎంకు ఈ అంశాన్ని ముందే చెప్పాను

    • తాను ఢిల్లీకి వచ్చినప్పుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేరు

    • రాజకీయాల్లో ఫైట్ చేస్తా.. సింపతీ మీద రాజకీయాల్లోకి రాలేదు

    త్వరలో సినిమాల్లోకి..

    • త్వరలో సినిమాలో నటించనున్నట్లు ప్రకటించిన జగ్గారెడ్డి

    • మాఫియాను ఎదురించి ఆడపిల్ల పెళ్ళి చేసే వ్యక్తి క్యారెక్టర్‌లో నటించనున్న జగ్గారెడ్డి

    • ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఒక కథ ఉంది అని చెప్పారన్న జగ్గారెడ్డి

    • ఆ కథలో తన పాత్ర ఉందని అన్నారన్న జగ్గారెడ్డి

    • ఆ సినిమాలో నటిస్తానని చెప్పిన జగ్గారెడ్డి

    • ఈ కథలో తన ఒరిజినల్ క్యారెక్టర్ ఉండబోతుందన్న జగ్గారెడ్డి

    • ఈ ఉగాదికి సినిమా కథ విని.. వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తామన్న జగ్గారెడ్డి

    • పీసీసీ,సీఎం అనుమతి తీసుకొని నటిస్తానన్న జగ్గారెడ్డి

  • 2025-03-10T11:50:56+05:30

    గుంటూరు కలెక్టరేట్ వద్ద హైందవ సంఘాల ఆందోళన

    • కలెక్టరేట్ ముందు హైందవ సంఘాలు ఆందోళన.

    • రాయచోటిలో వీరభద్ర స్వామి ఉత్సవంలో హిందువులపై దాడికి వ్యతిరేకంగా ధర్నా.

    • జై శ్రీరామ్ నినాధాలతో నిరసన

    • కూటమి ప్రభుత్వంలో హిందువులపై దాడి బాధకరమంటున్న హైందవ సంఘాల ప్రతినిధులు

    • రోహింగ్యాలతో ఓ పధకం ప్రకారం దాడులు చేయిస్తున్నారు

    • హైదరాబాద్‌‌లో కూర్చుని కొందరు మురికి నాయకులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు- బిజేపి నేత వల్లూరి జయ ప్రకాష్ నారాయణ

  • 2025-03-10T10:23:44+05:30

    బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు

    • వీడిన ఉత్కంఠ

    • ఎమ్మెల్యే కోటాలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

    • మాధవ్, సోము వీర్రాజు పేర్లపై తర్జనభర్జన

    • చివరకు సోము వీర్రాజు పేరు ఖరారు

    • మాధవ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారంటూ ప్రచారం

    • ఈ నేపథ్యంలో సోము వీర్రాజుకు ప్రాధాన్యత

    • గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన సోము వీర్రాజు

    • 2014 టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవి పొందిన సోము వీర్రాజు

  • 2025-03-10T10:11:49+05:30

    సీఎం చంద్రబాబు ఇవాల్టి షెడ్యూల్ ఇదే

    • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారంషెడ్యూల్

    • ఉదయం 10.15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి అసెంబ్లీకి

    • ఉదయం 11.00 గంటల వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్న సీఎం

    • ఉదయం 11.00 గంటలకు ఆర్టీజీఎస్, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష

    • మధ్యాహ్నం 12 నుంచి 1.25 వరకు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం

    • రాత్రి 7 గంటలకు సచివాలయం నుంచి విజయవాడకు సీఎం

    • రాత్రి 7 నుంచి 08 గంటల వరకు నోరి దత్తాత్రేయ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న సిఎం

    • రాత్రి 8.15 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు