Home » Cyber attack
ట్రేడింగ్లో అధిక లాభాలు ఇస్తామని నమ్మించిన సైబర్ క్రిమినల్స్(Cyber criminals).. 62 ఏళ్ల వృద్ధుడిని ‘మామ్’ వాట్సాప్ క్లబ్లో చేర్పించి, లాభాలు ఇస్తున్నట్లు నటించి రూ.10,53,696లను కొల్లగొట్టారు. బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నాడు.
లావోస్లోని సైబర్ స్కామ్ సెంటర్లలో చిక్కుకుపోయిన 47 మంది భారతీయులని రక్షించినట్లు అక్కడి భారత ఎంబసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
మనీ ల్యాండరింగ్(Money Laundering) కేసులు, వేధింపుల కేసుల పేరు చెప్పి వృద్ధురాలిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఆమె ఖాతా ఖాళీ చేశారు. నగరానికి చెందిన వృద్ధురాలు(85)కు గుర్తు తెలియని నంబర్ నుంచి ఓ మహిళ ఫోన్ చేసింది. తాను టెలికాం శాఖ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పింది.
ఎక్కడో ఉత్తరాదిలో ఉంటూ.. అమాయకులకు కుచ్చుటోపీ పెడుతూ.. రూ.కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు సహకరిస్తున్నదెవరో తెలుసా? వారు చేసే ప్రతీ నేరానికి సిమ్ కార్డులు మొదలు..
ఇటివల పలువురికి బెదిరింపు ఇమెయిల్స్(emails) వచ్చాయి. ఆ లేఖల ద్వారా హ్యాకర్లు పిల్లల అశ్లీలత, లైంగిక దోపిడీ గురించి ఆరోపణలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ దోస్త్.. సోషల్ మీడియా(social media)లో వైరల్ అయిన లెటర్ గురించి ప్రజలను హెచ్చరించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
క్రెడిట్ కార్డు(Credit card) లేకున్నా బిల్లు కట్టాలని బెదిరించాడు. ఇంకో వ్యక్తితో వీడియో కాల్లో మాట్లాడించి బ్యాంక్స్కామ్లో మీ పాత్ర ఉన్నదని భయపెట్టి ఓ యువకుడి నుంచి రూ.5 లక్షలు దోచేశారు. నగరానికి చెందిన ఓ యువకుడి (28)కి ఈనెల 19న గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది.
స్టాక్ మార్కెట్లో లాభాలంటూ నగర యువకుడిని నమ్మించిన సైబర్ క్రిమినల్స్(Cyber criminals) అతడి నుంచి రూ.5,93,840లను కొల్లగొట్టారు. మోసపోయిన బాధితుడు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
సైబర్ కేసులు ఇటీవల కాలంలో పెరిగి పోతున్నాయి. నేరగాళ్ల బారిన ప్రముఖ వ్యక్తులు పడుతున్నారు. నంబర్ తీసుకొని, బెదిరిస్తున్నారు. భయపడ్డారో ఇక అంతే సంగతులు. ఎన్సీపీ నేత, బారామతి ఎంపీ సుప్రియా సూలే కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఆమె వాట్సాప్ నంబర్ హ్యాకయ్యింది. సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 400 డాలర్లు పంపించాలని కోరారట. మన కరెన్సీలో రూ.32 వేలు పంపించాలని అడిగారట. అకౌంట్ నంబర్ కూడా పంపించారని సుప్రియా సూలే వివరించారు.
సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. జనాలను మోసం చేసేందుకు కొత్త పంథాను ఎంచుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారని, మోసం చేసేందుకు కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. ఓ తండ్రికి ఫోన్ చేసి మీ కూతురిని కిడ్నాప్ చేశామని ఒకడు, మహిళ పేరుతో డ్రగ్స్ సప్లై అవుతున్నామని మరొకడు ఫోన్ చేశాడు. జనాలను బురిడీ కొట్టించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
‘మీ పేరుతో డ్రగ్స్(Drugs) పార్సిల్ డెలివరీ అయింది. పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయి. పై అధికారులు చెప్పిన విధంగా నడుచుకొని అడిగినంతా డబ్బులు ఇవ్వాలి. లేదంటే అరెస్టు చేస్తామని’ గుర్తుతెలియని వ్యక్తులు క్రైమ్ బ్రాంచి పోలీసుల్లా(Crime Branch Police) బెదిరించారు.