Home » Devineni Umamaheswara Rao
Andhrapradesh: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ క్యాబినేట్లో ఉన్న 40 మంత్రలు ఓడిపోతున్నారని.. వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టమైందన్నారు. వైసీపీ కార్యకర్తలను, ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ సజ్జల యత్నిస్తున్నారని మండిపడ్డారు.
పోలింగ్‌కు మరికొన్ని గంటలే సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్పీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీపై మరోసారి కుట్ర పన్నింది.
Andhrapradesh: జిల్లాలోని బుట్టాయిగూడెం మండల టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు గురువారం సమావేశమయ్యారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, పోలవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు , టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. 72 శాతం పోలవరం ప్రాజెక్టును టీడీపీ పూర్తి చేస్తే.. జగన్ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్‌ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.
వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) అన్నారు. సీఎం జగన్ (CM Jagan), వైసీపీ నేతలపై ఎన్నికల సంఘానికి (Election Commission) తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు సచివాలయంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు-2024కు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నేతలు నామినేషన్లు సమర్పించగా మరికొందరు సన్నద్ధమవుతున్నాయి. మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ రేపు (సోమవారం) నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కార్యాలయానికి వసంత కృష్ట ప్రసాద్ వెళ్లారు.
వైసీపీ సర్కార్ ఆకృత్యాలు పరాకాష్టకు చేరాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Uma Maheswara Rao) మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), జనసేన అధినేత (Pawan Kalyan) పై రాళ్లదాడి పిరికిపంద చర్య అని చెప్పారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.
ఫోన్ ట్యాపింగ్ అంశం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్‌కు గురైంది. దాంతో సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఫోన్లను అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh ) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్టీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఒంగోలులో టీడీపీ నేతలపై దాడి అంశాలపై అదనపు సీఈఓ కు ఫిర్యాదు చేశారు.
ఏపీలో ఎలక్షన్ కోడ్ నడవట్లేదని వైసీపీ (YSRCP) కోడ్ కొనసాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao) అన్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు దేవినేని మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ఎన్నికల ఉల్లంఘనలపై ప్రశ్నించిన ప్రజలపై ఆ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.