Home » Devineni Umamaheswara Rao
ఏపీలో ఎలక్షన్ కోడ్ నడవట్లేదని వైసీపీ (YSRCP) కోడ్ కొనసాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao) అన్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు దేవినేని మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ఎన్నికల ఉల్లంఘనలపై ప్రశ్నించిన ప్రజలపై ఆ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
Andhrapradesh: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయ కాంపౌండ్లో హెరిటెజ్కు సంబంధింన కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో టీడీపీ నేతలు మాట్లాడుతూ... ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్లు తగలబెట్టారనేది వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ (CM Jagan), సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం సీనియర్ నేతలు వర్లరామయ్య దేవినేని ఉమామహేశ్వరరావు చేశారు. ఈ సందర్భంగా వర్లరామయ్య (Varlaramaiah) మాట్లాడుతూ... జగన్ ఇష్టం వచ్చినట్లు నోటకి వచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు జగన్ అతీతుడా అని అడిగామన్నారు. జగన్ నటుడుగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు.
Andhrapradesh: నందిగామలో వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆంధ్ర హస్పటల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రోద్భలంతోనే ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వసూల్ బ్రదర్స్ దుర్మార్గాలను ఎదిరించి తంగిరాల సౌమ్య వీరోచితంగా పోరాడుతున్నారన్నారు.
సీఎం జగన్రెడ్డి (CM Jagan Reddy) చెప్పిన అబద్దాలే మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni Uma) అన్నారు. తాను ఫ్టస్ట్ క్లాస్ స్టూడెంట్ అని శాసన సభలో జగన్ చెప్పారని... అబద్దాలు చెప్పడంలో జగన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటేనని ఎద్దేవా చేశారు.
Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు (Devineni Uma Maheswara Rao).. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) కీలక బాధ్యతలు అప్పగించారు...
అమరావతే రాజధాని అని ఈ ప్రాంత ప్రజలను, రైతులను నమ్మించి సీఎం జగన్రెడ్డి గొంతు కోశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు కాన్వాయిని తనిఖీల పేరుతో ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారని మండిపడ్డారు.
ట్రాఫిక్కి కారణమై ప్రజలకు ఇబ్బందులకు గురి చేశారన్న కారణంతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి జక్కంపూడి కాలనీలో టీడీపీ జెండాలతో ఆయన ర్యాలీ నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు, లోకేష్ కల్పించిన ఈ అవకాశం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను, అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు. గత 15 ఏళ్లుగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్చార్జిగా ఉండటంతో అక్కడున్న వారిని అందరిని కలుపుకొని ముందుకెళ్తానని చెప్పారు. తనకు ఎవరితో వ్యక్తిగత వివాదాలు లేవని అన్నారు.
టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టికెట్ దక్కించుకున్నారు. ఇటీవలే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్నసందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.