Home » Devotees
దసరా ఉత్సవాల తొలిరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని 49వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు వెల్లడించారు. రెండో రోజు అమ్మవారిని 65వేల మంది దర్శించుకున్నారని ఆయన తెలిపారు.
ఆశ్వయుజ మాసం ఈ రోజు నుండి అంటే.. గురువారం నుంచి ప్రారంభమైంది. అంటే.. శరన్నవరాత్రులు మొదలైనాయి. ఈ సందర్భంగా అమ్మలగన్న యమ్మ ముగ్గరుమ్మల మూలపుటమ్మ... దుర్గమ్మను భక్తులు కొలుస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ దేవతా రూపాల్లో అలంకరిస్తారు.
ఇంద్రకీలాద్రిపై గురువారం ఉదయం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రేపట్నుంచి పది రోజులపాటు కనకదుర్గాదేవి వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈసారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వస్తున్న భక్తులకు గుట్ట మీద.. వసతి పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో కొత్తగా 200 గదులను నిర్మించాలన్న ప్రతిపాదన ముందుకొచ్చింది.
Andhrapradesh: తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదంటూ శ్రీవారి ఆలయం వద్దే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి భక్తుడు ఫిర్యాదు చేశాడు. నిన్నటి (ఆదివారం) నుంచి క్యూ లైనల్లో వేచి వున్నా స్వామి వారి దర్శన భాగ్యం దక్కలేదన్నారు. అంతేకాకుండా క్యూలైనల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయలేదని తెలిపారు. చిన్న బిడ్డలతో క్యూలైన్లలో వేచి ఉండలేక బయటకు వచ్చేసామంటూ మంత్రికి సదరు భక్తుడు ఫిర్యాదు చేశాడు.
గణేశుడికి మొదటి పూజతోనే ఏదైనా శుభ కార్యాలు ప్రారంభించాలని.. అప్పుడే అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే వివాహానికి సంబంధించి మొదటి శుభ లేఖను విఘ్నేశ్వరుడి చెంత ఉంచుతారు.
ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్(Khairatabad) మహాగణపతి(Lord Vinayaka) దర్శనం వినాయక చవితికి ఒక రోజు ముందే ప్రారంభమైంది. వరసగా 70ఏళ్ల నుంచి విగ్రహం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి 70అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు పెట్టారు.
TTD Temple: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో నిరంతరం లడ్డూలు విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో నిత్యం లడ్డూలు లభించనున్నాయని అధికారులు తెలిపారు.
మాస శివరాత్రి పురస్కరించుకొని మహా నంది క్షేత్రంలో ఆదివారం వేదపండితులు రాహుకేతు పూజలు నిర్వహించారు.