Home » DGP Ravi Gupta
ఆంధ్రప్రదేశ్ పోలీసులు(Andhra Pradesh) వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఫైర్ అయ్యారు. ప్రధానంగా డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీజీపీకి టైమ్ దగ్గర పడింది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల వాహనాలు మాత్రమే తనిఖీ చేయమని డీజీపీ(AP DGP) ఆదేశాలు ఇచ్చినట్లు కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారన్నారు. పార్టీ అంతర్గత సమావేశంలో..
భారత జాగృతి దీక్ష కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నియామకల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలుల్లో జరుగుతున్న అన్యాయంపై ఈనెల 8వ తేదీన ధర్నాను తలపెట్టారు.
Andhrapradesh: నామినేషన్‌లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని లేఖలో పేర్కొన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై పలు అక్రమ కేసులు బనాయించారన్నారు.
Telangana: తెలంగాణ డీజీపీ రవి గుప్తాను బీఆర్‌ఎస్ మహిళా నేతలు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఇల్లందు మునిసిపాలిటీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా బిఆర్ఎస్ కౌన్సిలర్లపై జరిగిన దాడికి సంబంధించి డీజీపీకి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇల్లందు మునిసిపాలిటీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లపై జరిగిన దాడి, కిడ్నాప్‌ల సంఘటనల విషయంలో దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు.
తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా పోలీసు శాఖలో భారీగా అధికారులు బదిలీ అయ్యారు. 12 మంది అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ డీజీపీ రవిగుప్తా(DGP Ravigupta)ను బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) మంగళవారం నాడు కలిశారు. తమ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ డీజీపీ కార్యాలయంలో నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తాకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ( NHRC ) నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఇంజినీరింగ్ కాలేజ్‌లో జనవరి 5వ తేదీన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చింది.
హైదరాబాద్: తెలంగాణా డీజీపీ రవి గుప్తా శుక్రవారం ఉదయం వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని, పోలీసులు, మీడియా సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామన్నారు.