RR vs RCB Toss: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:08 PM
Indian Premier League: రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ స్టార్ట్ అయింది. మరి.. ఎవరు టాస్ నెగ్గారు.. ఎవరు ముందు బౌలింగ్‌కు దిగుతారు.. ఎవరు తొలుత బ్యాటింగ్ చేయనున్నారో ఇప్పుడు చూద్దాం..

రాజస్థాన్ రాయల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ స్టార్ట్ అయింది. టాస్ నెగ్గిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తొలుత బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దీంతో ఆతిథ్య సంజూ సేన మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇవాళ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగింది ఆర్సీబీ. ప్రతి ఏడాది ఒక మ్యాచ్‌కు ఇలా గ్రీన్ జెర్సీతో ఆడటం కోహ్లీ టీమ్‌కు రివాజుగా మారింది. దీని వెనుక సాలిడ్ రీజన్ కూడా ఉంది. ప్రకృతి పరిరక్షణపై జనాల్లో అవగాహన తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రతి సీజన్‌లో గ్రీన్ జెర్సీని ధరిస్తారు బెంగళూరు ఆటగాళ్లు.
గ్రీన్ జెర్సీ టెన్షన్
ప్రతి క్యాష్ రిచ్ లీగ్ ఎడిషన్‌లో గో గ్రీన్ ఇనిషియేటివ్ కింద గ్రీన్ కిట్స్ వేసుకుంటారు బెంగళూరు ఆటగాళ్లు. ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో మొత్తంగా 14 సార్లు గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగింది ఆర్సీబీ. ఇందులో 4 మ్యాచుల్లో మాత్రమే ఆ టీమ్ విక్టరీ కొట్టింది. అంతగా కలసిరాని గ్రీన్ జెర్సీతో ఇవాళ కోహ్లీ టీమ్ ఎలాంటి ఫలితం రాబడుతుందో చూడాలి. ప్లేయింగ్ ఎలెవన్స్ విషయానికొస్తే.. లాస్ట్ మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగింది ఆర్సీబీ. అటు రాజస్థాన్ జట్టులో వనిందు హసరంగ రూపంలో ఒక చేంజ్ చేశారు.
ఇవీ చదవండి:
ప్లేయింగ్ 11తో మెంటలెక్కిస్తున్నారు
అభిషేక్ నిజంగా గ్రేట్.. జ్వరంతో బాధపడుతూ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి