Home » Eknath Shinde
శివసేన లీడర్ సంజయ్ రౌత్ పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) ని ఔరంగజేబుతో పోల్చాడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశాన్ని అనుమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో తమ కూటమి అధికారంలోకి రావడానికి కారణం రెండు పార్టీల్లో చీలికని స్పష్టం చేశారు. ఆ చీలిక జరగడం వల్ల తనకు ఇద్దరు మిత్రులు లభించారని వివరించారు.
వలస పాలకుల నాటి పాతపేర్ల స్థానే కొత్త పేర్లను మార్చుకుంటూ వెళ్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం మరో ప్రాంతానికి పేరు మార్చింది. అహ్మద్‌నగర్ పేరును అహల్యా నగర్‌గా మార్చాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మంత్రివర్గం బుధవారంనాడు ఆమోదం తెలిపింది.
మహారాష్ట్ర దిగ్గజ నేత, ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ విందు ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శుక్రవారంనాడు తోసిపుచ్చారు. ముందస్తు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాలేకపోతున్నానంటూ సీఎం తెలియజేశారు.
శివసేన (యూబీటీ)పై ముంబై ఆర్థిక నేరాల పోలీస్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. శివసేన పార్టీ షిండే వర్గానిది అని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ప్రకటన చేసిన తర్వాత పార్టీ నుంచి రూ.50 కోట్ల నిధులను ఉద్దవ్ థాకరే వర్గం విత్ డ్రా చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తారని మరాఠీ రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. మనోజ్ వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఖండించారు. తమ ప్రభుత్వ సహనాన్ని పరీక్షించొద్దని తేల్చిచెప్పారు.
మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీకి విద్య, ఉద్యాగావకాశాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహారాష్ట్ర రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా కమ్యూనిటీకి 10 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సభలో ప్రవేశపెట్టారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ మిత్రపక్షమైన శివసేన నాయకుడు మహేశ్ గైక్వాడ్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటన కళ్యాణ్ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోని ఉల్లాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
'ఇది ట్రైలర్ మాత్రమే. ముందుంది సినిమా'' అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవర ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీనిపై ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ, అసలు సినిమా ముందుందంటూ లోక్‌సభ ఎన్నికలకు ముందు మరిన్ని చేరికలు ఉండబోతున్నాయనే సంకేతాలిచ్చారు.
దాదాపు 18 నెలలుగా స్పీకర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి మహారాష్ట్రలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్ రాహుల్ నార్వేకర్ బుధవారంనాడు స్పష్టం చేశారు. శివసేన నుంచి సీఎం ఏక్నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేనకు లేదని తేల్చిచెప్పారు.