Home » Election Commission of India
లోక్ సభ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పురుషుల కన్నా ఓటింగ్ శాతం అతివలదే నమోదవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళల ఓటింగ్ శాతం 0.16 ఎక్కువగా ఉంది. ఈ సారి అది మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. అందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల కోసం వరాలు కురిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లలో 90 శాతం హైదరాబాద్‌లోని ఎలకా్ట్రనిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) రూపొందించినవే.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ నాయకుల మీద తాము చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని విపక్ష ఇండియా కూటమి నాయకులు ఎలక్షన్ కమిషన్‌ను కోరారు. మొదటి రెండు దశల పోలింగ్ వివరాల వెల్లడిలో జాప్యం జరగడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు.
పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉంటారు. ఒకరు ఓటరును గుర్తిస్తారు. మరొకరు సిరా చుక్క పెడుతుంటారు. ఈవీఎం పరిసరాల్లో మరొకరు ఉంటారు. వారి ఎదురుగా పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కో పార్టీ తరఫున ఒకరు ఉంటారు. దొంగ ఓట్లు పడకుండా తగిన చర్యలు తీసుకుంటారు. పోలింగ్ ఏజెంట్లకు మరో బాధ్యత కూడా ఉంటుంది.
ఎన్నికల సమయం. ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ఓట్లు వేసేందుకు పోలింగ్ రోజు బూత్‌లకు క్యూకడుతుంటారు. ఓట్ల పండుగ అంటే చెప్పేదేముంది.. అంతా హడావుడి.. రకరకాల జనం ఓటు కోసం వస్తుంటారు. ఓటు వేయడానికి ఎన్నికల సంఘం పలు నిబంధనలు రూపొందించింది. ఓటు వేసే సమయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందే. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.
Andhrapradesh: సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండి లేఖ రాసింది. నిధుల విడుదలలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ సీఎస్‌కు లేఖ రాసింది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డీబీటీ పథకాల అమలవుతున్నాయా? అని ప్రశ్నించింది. జనవరి 2024 నుంచి మార్చి 2024 వరకు పథకాలకు నిధులు ఇవ్వలేని ప్రభుత్వం పరిస్థితి ఒక్కసారిగా ఎలా మారిందని..
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. 16 రోజుల పాటు 13 లోక్ సభ నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ జరిగింది. ప్రచారానికి ఎన్నికల సంఘం బ్రేక్ ఇవ్వడంతో మే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు బ్రేక్ పడింది. మిగతా అంతా షెడ్యూల్ ప్రచారం జరిగింది. అయినప్పటికీ కేసీఆర్ ప్రభావం అంతగా కనిపించడం లేదు.
ఏపీలో పోలింగ్ టైమ్ దగ్గరపడింది. పొరుగూరు అంతా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఊరు నుంచి వచ్చిన ఓటర్ల దగ్గరకు వెళ్లి పార్టీ శ్రేణులు పలకరిస్తున్నారు. ప్రయాణం ఎలా జరిగింది. అంతా కులాశానేనా.. పని ఎలా నడుస్తుంది. ఆరోగ్యం బాగుందా అంతా అప్యాయంగా పలకరిస్తూ.. చివరిలో మన గుర్తు మర్చిపోకు.. మన పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు .
మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024) జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జగన్ చేస్తున్న కుటీల ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్‌కు 2 రోజుల ముందు డబ్బులు పంపిణీ చేయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టింది. సంక్షేమ పథకాల సొమ్ముల చెల్లింపునకు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది.
ఢిల్లీ: లోక్‌సభ మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 93 పార్లమెంటు స్థానాలలో మూడో దశ పోలింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఈసీ వెల్లడించింది.