AP Election 2024: మీ ఓటు ఎవరైనా వేస్తే .. ఇలా చేయండి.. ఓటింగ్‌పై వర్లరామయ్య కీలక సూచనలు
ABN , Publish Date - May 12 , 2024 | 04:48 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు(సోమవారం) అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌లో మీ ఓటును మీరు కాకుండా ఇతరులు ఎవరైనా వేసినట్లు గుర్తిస్తే వెంటనే ఎన్నికల సంఘానికి (Electoral Commission) ఫిర్యాదు చేయండి. మీ ఓటుపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నాఈసీకి తెలియజేయాలి. రేపు జరుగుతున్న పోలింగ్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య కీలక సూచనలు చేశారు.
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు(సోమవారం) అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌లో మీ ఓటును మీరు కాకుండా ఇతరులు ఎవరైనా వేసినట్లు గుర్తిస్తే వెంటనే ఎన్నికల సంఘానికి (Electoral Commission) ఫిర్యాదు చేయండి. మీ ఓటుపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నాఈసీకి తెలియజేయాలి. రేపు జరుగుతున్న పోలింగ్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య కీలక సూచనలు చేశారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్లరామయ్య (Varla Ramaiah) మీడియా సమావేశం నిర్వహించారు.
AP Elections: వంగా గీత కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఓటర్లు... విషయం ఇదే!
దొంగ ఫొటోలతో మోసం చేస్తారు..
‘‘దుర్మార్గపు ఆలోచనలు, దొంగ ఫొటోలతో కొంత మంది మోసం చేస్తారు.. ఓటర్లు మోసపోవద్దు. ఓటును హక్కుగా భావించండి.. మీ హక్కును ఓటుగా బూత్‌లో వేయాలి. ఇంకు పూసినా.. ఇంకైమైనా చేసినా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇంకు రాసినంత మాత్రానా ఓటు హక్కు హరించలేరు. నీవు వెళ్లేటప్పటికే మీ ఓటును ఎవరైనా వేస్తే ఛాలెంజ్ ఓటును ఎన్నికల అధికారులను అడిగి తీసుకుని మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అప్పటికే మీ ఓటును ఎవరైనా వేశారని అధికారి చెబితే మీరు టెండర్ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓటు వేయకుండా అపవిత్రం చేయకండి. దుర్మార్గుల చేతికి మీ ఓటును వెళ్లనివ్వద్దు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. రాష్ట్ర భవిష్యత్ ఓటర్ల చేతుల్లో ఉంది. ఎండ, వానకు భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి’’ అని వర్ల రామయ్య సూచించారు.
Lok Sabha Elections: ఓటెయ్యండి.. బంపర్ ఆఫర్స్ కొట్టేయండి.. వివరాలివే..
90శాతం పోలింగ్ దాటాలి...
‘‘గత ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలు హైదరాబాద్, బెంగుళూరులాంటి నగరాల్లో 40% పోలింగ్ మాత్రమే నమోదయింది. మన రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా పట్టణ ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోని రాష్ట్ర ఉన్నతికి సహకరించాలి. 90శాతం పోలింగ్ దాటేలా ఓటర్లు తమ పవిత్రమైన ఓటును వినియోగించుకోవాలి. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల్లోపు అధిక శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల కమిషన్ ఓటర్లకు మౌళిక సదుపాయాలు కల్పించాలి, అవసరమైన వారికి సహాయకులను ఏర్పాటు చేయాలి’’ అని వర్లరామయ్య కోరారు.
ప్రజలు అర్థం చేసుకోవాలి
‘‘వర్షం పడితే ఓటర్లు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి. దివ్యాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలి. ఓటు వేసేటప్పుడు పోలింగ్ అధికారుల సహాయం తీసుకునే ముందు తగు జాగ్రత్తలు ఓటర్లు తీసుకోవాలి. నేడు అంతర్జాతీయ తల్లుల దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో ఓ తల్లి ఆక్రందన, ఆవేదన, ఆత్మఘోష రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. బాపట్లలో దళితుడిపై దాడి చేసిన కోన వెంకట్, ఎస్ఐ జనార్థన్‌ను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి’’ అని వర్లరామయ్య డిమాండ్ చేశారు.
Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?
Read Latest AP News And Telugu News