AP Election 2024 : ఎన్నికల ప్రచారం ముగిసిన బల్క్ ఎస్ఎంఎస్‍లు.. ఎన్నికల సంఘం నిఘా
ABN , Publish Date - May 11 , 2024 | 08:50 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) మే 13న పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ (Election Commission) శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ఈరోజు(శనివారం) సాయంత్రం 6 గంటలకే ముగిసింది. ప్రచారం ముగిసిన కూడా ఓటర్లకు పలు రాజకీయ పార్టీల నుంచి బల్క్ ఎస్ఎంఎస్‍లు వస్తునే ఉన్నాయి. వీటిపై ఈసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లా: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) మే 13న పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ (Election Commission) శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ఈరోజు(శనివారం) సాయంత్రం 6 గంటలకే ముగిసింది. ప్రచారం ముగిసిన కూడా ఓటర్లకు పలు రాజకీయ పార్టీల నుంచి బల్క్ ఎస్ఎంఎస్‍లు వస్తునే ఉన్నాయి. వీటిపై ఈసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బల్క్ ఎస్ఎంఎస్‍లు ఓటర్లకు వస్తే 1950, లేదా సీవిజిల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.
Lok Sabha Polls 2024: ఓటర్లకు అలర్ట్.. పోలింగ్ రోజు ఈ తప్పు అస్సలు చేయకండి..
కాగా సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ముగిసిందని.. జిల్లాలో 1915 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే బల్క్ ఎస్ఎంఎస్‌లపైనా నిఘా ఉంటుందని హెచ్చరించారు. పోలింగ్ నిర్వాహణకు అధికారులు, సిబ్బందికి బాధ్యతలు కేటాయించామన్నారు. ఎవరు ఏ పోలింగ్ సెంటర్‌కు వెళ్లాలో ఆదివారం నాడు నిర్ణయిస్తామని చెప్పారు. 14 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్ చేస్తున్నామన్నారు.
Lok Sabha Election 2024: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఆందోళనలో మద్యం ప్రియులు
ఈవీఎం తీసుకెళ్లి ప్రతి బస్సుకు జీపీఎస్ ఏర్పాటు చేసి ట్రాక్ చేస్తున్నామని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల వాహనాలకు పాసులు తప్పనిసరి అని తెలిపారు. కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ర్యాలీలు చేయరాదని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
Voter ID: మీ ఓటు ఉందా లేదా? ఒక్క క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ తుషార్ దూడి
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి (Guntur SP Tushar dudi) హెచ్చరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒకరు తప్పుడు పోస్ట్ పెట్టారని.. దీనిపై కేసు నమోదు చేశామని అన్నారు. పోలింగ్ సిబ్బంది, పోలీసులకు అందరూ సహకరించాలని చెప్పారు. వారిని ఇబ్బందులకు గురి చేసినా, అడ్డగించినా, దాడి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఉన్న ఇళ్లలోకి రాజకీయ పార్టీల వారిని రానీయొద్దని ఎస్పీ తుషార్ దూడి సూచించారు.
Loksabha Polls: సాయంత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు: వికాస్ రాజ్