Home » Election Commission of India
ఒకరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి, మరొకరు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో ధర్మారెడ్డి. వీరిద్దరూ ‘హద్దులు’ మీరారంటూ విపక్ష బీజేపీ, టీడీపీ సహా పలు పార్టీల నాయకులు కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది...
ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) వివాదంలో మరో కొత్త కోణం. కంపెనీ ఏర్పాటైన మూడేళ్ల తర్వాతే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అర్హత లభిస్తుదని నిర్దేశిత చట్టం స్పష్టం చేస్తున్నప్పటికీ.. పలు కంపెనీలు ఆ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించాయి. పార్టీలకు(Political Parties) విరాళాలు సమర్పించుకున్నాయి.
రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Comission) షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించింది.
ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు(YS Jagan) కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India) బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి కొల్లి రఘురామిరెడ్డిని(Raghuram Reddy) పంపించేసింది. సిట్ చీఫ్‌గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిపై వేటు వేసింది ఈసీ. అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సీఎం జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేశారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పినా పింఛన్‌దారులను ఎండలో సచివాలయాలకు తిప్పారని మండిపడ్డారు.
మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి జై భీమ్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి (Dastagiri) కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), కాంగ్రెస్ చీఫ్ షర్మిల (YS Sharmila), వివేకా కూతురు సునీతారెడ్డి వాడుకుంటున్నారని సోమవారం నాడు ఎలక్షన్ కమిషన్ (Election Commission)కి దస్తగిరి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి(Election Commission) ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(Kanakamedala Ravindra Kumar) ఆదివారం నాడు లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
2024 ఏపీ సార్వత్రిక ఎన్నికలల్లో(AP Election 2024) సామాజిక మాధ్యమాల ద్వారా యువత, పట్టణ ఓటర్లను నిమగ్నం చేయాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) అన్నారు. దీనికోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఈఓ తెలిపారు. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడానికి 'టర్నింగ్ 18' ప్రచారం ద్వారా యువ, మొదటిసారి ఓటర్లకు ప్రోత్సాహానిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (CM Jagan)కి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలపై జగన్‌కు ఎన్నికల సంఘం (Election Commission) నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వలని ఈసీ ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో పింఛన్ల పంపిణీపై గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పెన్షన్ల పంపిణీలో వలంటీర్లు జోక్యం చేసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఆదేశించింది. దీంతో ఏపీలో పింఛన్ల (AP Pensions) పంపిణీ కొంత ఆలస్యం అయింది.