AP Election 2024: ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి.. నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 16 , 2024 | 05:26 PM
ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలంటే సెంట్రల్ బలగాలతో ఏపీలో ఎన్నికలు జరిపించాలని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. మంగళవారం నాడు ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. సీఎం జగన్ (CM Jagan)కు దెబ్బ తగలటం శాంతిభద్రతల లోపమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలోనూ, తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సభల్లోనూ లా అండ్ ఆర్డర్ లోపం కనిపించిందన్నారు.
అమరావతి: ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలంటే సెంట్రల్ బలగాలతో ఏపీలో ఎన్నికలు జరిపించాలని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. మంగళవారం నాడు ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. సీఎం జగన్ (CM Jagan) కు దెబ్బ తగలటం శాంతిభద్రతల లోపమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలోనూ, తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సభల్లోనూ లా అండ్ ఆర్డర్ లోపం కనిపించిందన్నారు.
CM Jagan: అందుకే జగన్‌పై రాయి విసిరా.. పోలీసు విచారణలో యువకుడు షాకింగ్ విషయాలు
పెన్షన్ల విషయంలోనూ చాలామందిని ఇబ్బందులకు సీఎస్ జవహర్ రెడ్డి గురిచేశారని మండిపడ్డారు. ఈ విషయాలపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశానని తెలిపారు. కేంద్ర బలగాల సహాయంతో ఈసారి పోలింగ్ చేయాలని కోరారు. కోడికత్తి కేసు ఇంతవరకు తేలింది లేదన్నారు. ఈ దాడి వెనుక కారణాలు ఏంటో బయటకు రాలేదన్నారు.అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకా నందారెడ్డి హత్య వెనుక కారణాలు బయటకు రాలేదని చెప్పారు.
AP Highcourt: చంద్రబాబుపై నమోదైన కేసుల్లో దిగొచ్చిన ఏపీ సర్కార్
వివేకా హత్య గురించి జగన్‌కు తెలుసునని చెప్పారు. వివేకా కూతురు వైఎస్.సునీత, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్ షర్మిల ప్రశ్నలకు జగన్ దగ్గర సమాధానాలు లేవన్నారు. జగన్ మేనత్త విమలమ్మ వివేకా కేసులో వన్ సైడెడ్‌గా మాట్లాడారన్నారు. ఇదంతా చూస్తుండగానే జగన్‌కు రాయి తగిలిందన్నారు. ఆ రాయి దెబ్బ వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఓ కన్నుకు దెబ్బతగిలిందన్నారు. నిజంగా రాయి తగిలితే.. గట్టి దెబ్బ తగిలేదని చెప్పారు. సీఎం జగన్ సభ అంటే 1000 మీటర్ల మేర జగన్ కోసం సెక్యూరిటీ ఆధీనంలో ఉంటుందని కానీ ఆ సమయంలో సెక్యూరిటీ అంతా ఏమైందని ప్రశ్నించారు.
ఇది ఆకతాయిలు చేసిన పనిలా లేదన్నారు. జగన్‌కు దెబ్బ తగలాగానే , సోషల్ మీడియాలో, కొన్ని ఛానెళ్లలో గగ్గోలు పెట్టిన బైట్స్, వీడియోలు ఎలా బయటకు వచ్చాయని ప్రశ్నించారు. ఇదంతా ప్రతిపక్షం మీద నెపం వేయటానికేనని అర్థమవుతోందన్నారు. ఎలక్షన్ కమిషన్ దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అసలు నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. కేంద్ర బలగాలతో సీఎం నుంచి సామాన్యుల వరకు సెక్యూరిటీ అందించాలని కోరారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న సీఎంకు ఇలా జరిగితే, సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. కోడికత్తి దాడి , వివేకా హత్య , జగన్ రాయి దాడిని పరిగణలోకి తీసుకుని , ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టాలని కోరారు. షర్మిల , సునీతలకు సెక్యూరిటీ పెంచాలని నట్టికుమార్ కోరారు.
YSRCP: 28 ఏళ్ల నిరీక్షణ.. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష
మరిన్ని ఏపీ వార్తల కోసం...