Purandeswari: ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి లేఖ.. కారణమిదే..?
ABN , Publish Date - Apr 13 , 2024 | 05:04 PM
దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులను అప్పగించ వద్దంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. ఈ మేరకు శనివారం నాడు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల (Election Commission) కు ఆమె లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు కలిసి సీఈఓ ముకేష్ కుమార్ మీనాకు సూచించినట్లు తెలిసిందని చెప్పారు.
అమరావతి: దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులను అప్పగించ వద్దంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. ఈ మేరకు శనివారం నాడు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల (Election Commission) కు ఆమె లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు కలిసి సీఈఓ ముకేష్ కుమార్ మీనాకు సూచించినట్లు తెలిసిందని చెప్పారు.
Chandrababu: ఎన్నికలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను ఏనాడూ వినియోగించుకోలేదని గుర్తుచేశారు. ఈ విషయంలో గతంలో ఎన్నికల విధుల్లో పనిచేసిన అధికారుల నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేవాదాయ శాఖ సిబ్బంది సాధారణంగా తమ పరిధిలోని దేవాలయాల్లో రోజువారీగా పరిపాలనా విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. పరిపాలనలో ఏదైనా అంతరాయం ఏర్పడితే భక్తులు ఇబ్బందులు పడతారన్నారు. ఆలయాల్లో నిర్ధిష్ట విధులను, ఆగమ శాస్త్ర మార్గదర్శకాలను ఆమోదించడం ద్వారా వాయిదా వేయలేరని చెప్పారు.
Nara Lokesh: నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా.. ఆఖరుకు ఆయన్నూ వదలలేదా..
దేవాదాయ శాఖ సిబ్బంది అంతా హిందూ మతానికి చెందినవారే ఉన్నారని తెలిపారు. వారిని ఎన్నికల విధుల్లో నియమిస్తే ఒక మతానికి చెందిన వారి సేవలను మాత్రమే వినియోగించుకుంటున్నారని నిరాధార ఆరోపణలు వస్తాయన్నారు. ఏప్రిల్, మే, జూన్ కాలం ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుందని వివరించారు. ఇక్కడ ఉగాది, శ్రీరామనవమి, చందనోత్సవం, నృసింహ జయంతి, బ్రహ్మోత్సవాలు, గ్రామ దేవత వార్షిక వేడుకలు మొదలైన అనేక పండుగలు వస్తాయని గుర్తుచేశారు.
దేవాదాయ శాఖల సిబ్బంది వివిధ దేవాలయాల్లో నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవుల సీజన్ కావడంతో ఏపీ వ్యాప్తంగా చాలా మంది తీర్థయాత్రలు, వారి స్వగ్రామాలను సందర్శిస్తుంటారన్నారు. అందువల్ల దేవాలయాలను వెళ్లే యాత్రికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఆలయాల్లో యాత్రా సౌకర్యాలను పర్యవేక్షించడానికి దేవాదాయ శాఖ సిబ్బంది గణనీయమైన సమయాన్ని వెచ్చించాల్సి వస్తోందన్నారు.
AP Elections: గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ సీనియర్ నేత
వేసవి సెలవులతో ప్రతి జిల్లాలో వేలాది మంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని.. వారికి ఎన్నికల విధులు కేటాయిస్తే బాగుంటుందని తెలిపారు. ఉపాధ్యాయులకు ఇది సెలవు సమయం, దేవాదాయ శాఖ సిబ్బందికి ఇది చాలా అత్యవసర సమయం అని చెప్పారు. ఎన్నికల్లో దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు.
ఇవి కూడా చదవండి
Elections 2024: అభ్యర్థి అవినాశ్ ను మార్చేందుకు యత్నాలు.. కుండ బద్దలు కొట్టిన షర్మిల..
జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి..
మరిన్ని ఏపీ వార్తల కోసం...