Home » Election Commission of India
జిల్లాలో ఈనెల 20 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే 18-19 సంవత్సరాల యువతను కొత్త ఓటరుగా నమోదుకు భారత ఎన్నికల కమిషన్ అవకాశమిచ్చింది. ఈనెల 20 నుంచి అక్టోబరు 18వ తేదీ నాటికి సవరణ ప్రక్రియ పూర్తి చేసి, అదేనెల 29న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సమాచారాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది.
వచ్చే ఏడాది జరగనున్న మూడు శాసన మండలి స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
పోలింగ్ శాతాల్లో భారీగా తేడాలు ఉన్నాయంటూ వస్తున్న విశ్లేషణలను ఆదివారం ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ప్రకటించిన ఓట్ల శాతానికి, తుది ఓట్ల శాతానికి మధ్య మరీ ఎక్కువగా తేడా ఉందంటూ విశ్లేషణలు వచ్చాయి.
తమ బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India)ను తెలంగాణ కాంట్రాక్టర్లు(TG Contractors) కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 15నియోజకవర్గాల్లో ఓటర్లకు కాంట్రాక్టర్లు మౌలిక సౌకర్యాలు కల్పించారు. ఆ పనులకు సంబంధించిన రూ.20కోట్లను సీఈసీ ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో పెండింగ్ బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలంటూ కాంటాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా సుదర్శన్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు(శుక్రవారం) ఉత్తర్వులు వెలువరించింది.
రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు ఒక నెల జీతాన్ని గౌరవ వేతనంగా ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదని, మాచర్ల మాజీ శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్నికల కమిషన్(ఈసీ)కు భారీ స్థాయిలో రూ.622 కోట్లు ఖర్చు కావడంపై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ) అనుమానం వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్ కేంద్రాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. జూలై 10వ తేదీన ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.