Home » Elections
దేశంలో అధికార, ప్రతిపక్ష కూటములు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘మహా’ యుద్థానికి తెరపడింది. మహారాష్ట్రతోపాటు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఎన్నికల స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఫిర్యాదులు అందిన తక్షణమే చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెలియజేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. వివిధ కేంద్రాల్లో ఓటింగ్ ఉదయం 7 గంటలకు మొదలు కాగా, ఇది సాయంత్రం 6 వరకు కొనసాగనుంది. అయితే మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఎంత మంది బరిలో ఉన్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శాసనసభలోని మొత్తం 288 స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది.
పోలింగ్ బూత్‌ల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకొని రాకూడదంటూ ఎన్నికల కమిషన్(ఈసీ) ఇచ్చిన ఆదేశాల్లో చట్టవ్యతిరేకత ఏమీ లేదని సోమవారం బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబై అన్ని పార్టీలకూ కీలకం కానుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కీలక సమయంలో అధికార ‘మహాయుతి’ కూటమిలో లుకలుకలు పెరుగుతున్నాయి. మహాయుతి కూటమి పక్షాన ఇటీవల ప్రచారం చేసిన యూపీ సీఎం, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్.. హిందువులను ఉద్దేశించి ‘కటేంగోతో బటేంగే’(ఐక్యత లేకపోతే విభజిస్తారు) అని వ్యాఖ్యానించారు.
శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ) పార్టీ సత్తా చాటింది.
రాజస్థాన్‌లో డియోలీ-ఉనియారాతోపాటు ఏడు నియోజకవర్గాలకు బుధవారం ఉపఎన్నిక జరిగింది. డియోలి-ఉనియారా నియోజకవర్గం తరఫున నరేశ్ మీనా అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు.
రాజస్థాన్ టోంక్‌లో అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా పెద్ద దుమారం రేగింది. ఓటింగ్ సమయంలో స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనా ఓ అధికారి చెంపపై కొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఆ క్రమంలో పోలీసులపై పలువురు రాళ్ల దాడి చేశారు.