Home » Exams
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ వెల్లడైంది. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన అడ్మిషన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మునిసిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లికి చెందిన గొల్ల శ్రీకాంత్ కుమార్ యాదవ్ ఇటీవల జరిగిన సీఎంఏ (కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్స్) పరీక్షల్లో జాతీయస్థాయి మొదటి ర్యాంకు సాధించారు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం (24వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం (24వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
తెలంగాణ(telangana)లో గ్రూప్ 1 ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ పరీక్షల నేపథ్యంలో పీజీఈసెట్(PGECET 2024) ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో పీజీఈసెట్ 2024 పరీక్షల షెడ్యూల్ తేదీల్లో మార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఏ అరుణ కుమారి ప్రకటించారు.
పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీజెట్ పరీక్షలను జూలై నెలలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలు సీపీజెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. దాని ప్రకారం ఈనెల 18 నుంచి వచ్చేనెల 17వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 25 వరకు, రూ.2 వేల ఆలస్యరుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. జూలై 5వ తేదీ నుంచి సీపీజెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
నిమిషం లేటు నిబంధన.. ఎడతెరిపి లేని వానతో టీఎస్ ఎప్‌సెట్‌కు తొలిరోజు హాజరైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఎంబీబీఎస్, ఆయుష్, బీడీఎ్‌సలో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పైచిలుకు విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. ఈసారి ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉందని,
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకోసం ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన ఎంట్రెన్స టెస్ట్‌ను (ఐసెట్-2024) సోమవారం నిర్వహిస్తామని సెట్ చైర్మన, ఎస్కేయూ వీసీ హుస్సునరెడ్డి శనివారం తెలిపారు. సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మురళీక్రిష్ణతో కలిసి ఐసెట్ నిర్వహణ గురించి ఎస్కేయూలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 6 నుంచి ఏప్రిల్ 27వరకు ఆనలైన ద్వారా ఐసెట్‌కు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఏపీ, తెలంగాణ నుంచి 48,828 ...
డిగ్రీలో సబ్జెక్టులు మిగిలిపోయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఎస్కేయూ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో పరీక్షల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సప్లిమెంటరీ పరీక్షలకు కొర్రీలు పెడుతూ వచ్చింది. దీంతో డిగ్రీ విద్యార్థులు ఫెయిల్ అయిన ఎస్కేయూ విద్యార్థులు సబ్జెక్టులను పూర్తిచేసుకోలేకపోయారు. ఈ సమస్యపై ఆంధ్రజ్యోతిలో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పటి వీసీ రామకృష్ణారెడ్డి తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆయన వైసీపీ నాయకుడి తరహాలో ...
తన కుమారుడి చేత పాలిసెట్ రాయించేందుకు ఓ తల్లి పడ్డ ఆవేదన అందరినీ కలిచివేసింది. కానీ అధికారులు మాత్రం కనికరం చూపలేదు. అనంతపురం నగరంలోని ఎస్‌ఎ్‌సబీఎన కళాశాల కేంద్రంలో పాలిసెట్ రాసేందుకు గుత్తి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నితిన.. తన తల్లి లక్ష్మిదేవితో కలిసి శనివారం వచ్చాడు. ఉదయం 8 గంటలకే బయలుదేరినా.. బస్సులు, ఆటోలు సమయానికి దొరక్కపోవడం, ట్రాఫిక్ సమస్య కారణంగా ఆలస్యమైంది. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా.. వారు 11.05 గంటలకు కళాశాల వద్దకు చేరుకున్నారు. నితిన పరుగున వెళ్లినా..