Home » Flight Ticket Offers
మానవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో ఫ్రెంచ్ అధికారుల అధీనంలో ఉన్న 303 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన విమానానికి లైన్ క్లియర్ అయింది. దీంతో మూడు రోజుల తర్వాత సోమవారం ఫ్రెంచ్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది.
మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నై తుఫాన్ ధాటికి అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. 8 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ వర్షాల ప్రభావం విమానాల ప్రయాణాలపై కూడా పడింది.
ఒమాన్, భారత్ మధ్య రాకపోకలు కొనసాగించేవారికి ఒమాన్ ఎయిర్ (Oman Air) గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని తిరువనంతపురం (Thiruvananthapuram) కు డైరెక్ట్ విమాన సర్వీస్ నడపనున్నట్లు ప్రకటించింది.
ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని భావించేవాళ్ల కోసం ఎయిరిండియా ప్రత్యేకంగా 96 గంటల సేల్ నిర్వహిస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాల కోసం కేవలం ప్రారంభ ధరగా రూ.1,470 చెల్లించి ఈ ఆఫర్ పొందవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా టిక్కెట్లపై కన్వీనియన్స్ ఫీజు కూడా ఉండదని ఎయిరిండియా వెల్లడించింది.
స్పైస్‌జెట్ టికెట్ ధరలపై ఒక బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్యాక్స్‌లతో కలిపి కూడా 1,515 రూపాయలకే విమాన టికెట్ ధరను పొందే అవకాశం కల్పించింది. కేవలం 15 రూపాయలతో కోరుకున్న సీట్లను ఎంచుకునే అవకాశం కూడా స్పైస్‌జెట్ ప్రయాణికులకు కల్పించింది.