SpiceJet: విమానం టికెట్లపై భారీ తగ్గింపు.. 1515 రూపాయలకే విమానం ఎక్కొచ్చట..!

ABN , First Publish Date - 2023-08-14T19:55:02+05:30 IST

స్పైస్‌జెట్ టికెట్ ధరలపై ఒక బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్యాక్స్‌లతో కలిపి కూడా 1,515 రూపాయలకే విమాన టికెట్ ధరను పొందే అవకాశం కల్పించింది. కేవలం 15 రూపాయలతో కోరుకున్న సీట్లను ఎంచుకునే అవకాశం కూడా స్పైస్‌జెట్ ప్రయాణికులకు కల్పించింది.

SpiceJet: విమానం టికెట్లపై భారీ తగ్గింపు.. 1515 రూపాయలకే విమానం ఎక్కొచ్చట..!

విమానం ఎక్కాలని ఎవరికి ఉండదు చెప్పండి. అవకాశం రావాలే గానీ విమానం ఎక్కి గాల్లో విహరించాలని అందరికీ ఉంటుంది. కానీ.. ఆకాశంలో తిరిగే విమానం ధరలు ఆకాశాన్ని అంటినట్టే ఉంటాయనే సంగతి తెలియంది కాదు. అయితే.. కొన్నికొన్ని పండుగల సందర్భంగా విమానయాన సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అలాంటి సమయంలో మధ్యతరగతి ప్రజలకు కూడా కాస్తంత అందుకునేలానే విమాన టికెట్ల ధరలు ఉంటాయి. అలాంటి సమయం రానే వచ్చింది. ఆగస్ట్ 15న భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ (SpiceJet) టికెట్ ధరలపై ఒక బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

F3bqxN7X0AAMrus.jpgF3bqxN8XcAA0TE0.jpg

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ట్యాక్స్‌లతో కలిపి కూడా 1,515 రూపాయలకే విమాన టికెట్ ధరను పొందే అవకాశం కల్పించింది. అంతేకాదు.. రూ.2 వేలు విలువ చేసే కాంప్లిమెంటరీ ఫ్లైట్ ఓచర్‌ను పొందే ఛాన్స్ కూడా ఉంది. కేవలం 15 రూపాయలతో కోరుకున్న సీట్లను ఎంచుకునే అవకాశం కూడా స్పైస్‌జెట్ ప్రయాణికులకు కల్పించింది. ఈ ఆఫర్ పొందాలంటే ఆగస్ట్ 14 నుంచి 20 లోపు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని సదరు సంస్థ స్పష్టం చేసింది. ఆగస్ట్ 15, 2023 నుంచి మార్చి 30,2024 లోపు ఈ ఆఫర్‌ను పొంది బుక్ చేసుకున్న టికెట్ ద్వారా.. బుక్ చేసుకున్న తేదీన ప్రయాణం చేయవచ్చని తెలిపింది. అయితే.. ఈ ఆఫర్‌ను పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటంటే..

* ఈ సేల్ ఆఫర్ డొమెస్టిక్, డైరెక్ట్, వన్-వే ఫ్లైట్ టికెట్లపైనే వర్తిస్తుంది.

* పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లు అందుబాటులో ఉంటాయి.

* ఈ సేల్‌లో భాగంగా బుక్ చేసుకున్న టికెట్లపై క్యాన్సిలేషన్ వెసులుబాటు కూడా ఉంది. అయితే క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి.

* ఈ ఆఫర్ కేవలం స్పైస్‌జెట్ పేర్కొన్న ప్రయాణ వ్యవధిలో (ఆగస్ట్ 15, 2023 నుంచి మార్చి 30,2024 లోపు) మాత్రమే వర్తిస్తుంది.

Updated Date - 2023-08-14T19:55:05+05:30 IST

×
CM Chandrababu: సంక్రాంతి కొత్త వెలుగులు, ఆనందం నింపాలి
News Hub