Home » Gannavaram
ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు శుక్రవారం న్యూఢిల్లీలో భేటీ కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. తన పార్టీ ఎంపీలతో కలసి గురువారం సాయంత్రం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆంధ్రప్రదేశ్‌లో జోష్ నింపాయి. రాష్ట్రంలో కూటమి గెలుస్తోందని బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. గతంలో కాసిన పందేనికి రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని ముందుకొస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత కూటమి విజయంపై బెట్టింగ్ రాయుళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది.
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. సీఎం కుటుంబం రాష్ట్రానికి చేరుకుంది. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ , మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ స్వాగతం పలికారు.
ఏపీలో ఎన్నికలు మాత్రమే జరిగాయి.. ఇంకా ఫలితాలు రాలేదు. ఏ పార్టీ గెలుస్తుందనేది జూన్-04న తేలిపోనుంది. ఈ గ్యాప్‌లో గన్నవరం వల్లభనేని వంశీ.. అమెరికా చెక్కేశారు. అసలు ఆయన అమెరికా ఎందుకెళ్లారు.. ఈ టూర్ వెనుక ఉన్న షాకింగ్ విషయాలేంటి..? అనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్‌ల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.
ఎన్ఆర్ఐ వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌కు(NRI Dr Lokesh) మళ్లీ చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఆయనను ఢిల్లీ(delhi) ఎయిర్ పోర్టు పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే దీనికి ముందు ఆదివారం గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అమెరికా వెళ్లారు. వాస్తవానికి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అమెరికా వెళ్లడం పెద్ద సంచలనం కలిగించే అంశమేమీ కాదు. అయితే వంశీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆయన ఏ అడుగు వేసినా అది చర్చనీయాంశంగా మారుతోంది...
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి లండన్ వెళ్తుండగా ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించడం.. ఆయన్ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది..? ఆ వ్యక్తి ఎందుకొచ్చారు..? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు వచ్చాయి. పైగా పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది...
ప్రజలిచ్చిన విరాళాలతో పోటీచేసి గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ఏలిన నియోజకవర్గమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు డబ్బే ప్రధానమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నగదు వెదజల్లాయి. ఒక ఓటు సుమారు రూ.3 వేల వరకూ పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది.
అంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న పోలింగ్ వేళ.. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ వెంకట్రావు విజయం ఖాయమైందని అందరికి అర్థమైపోయింది. ఆ క్రమంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చిపోయారు. సురంపల్లిలోని పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ పరిశీలిస్తున్న యార్లగడ వెంకట్రావుపై వారు దాడికి పాల్పడ్డారు.