Home » Hindu
జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసేందుకు వారణాసి సెషన్స్ జడ్జి ఇటీవల అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దానిని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ రోజు అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది.
అబుదాబిలో మొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అయితే ఈ ఆలయం ప్రత్యేకతలు, విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందుత్వ సిద్ధాంతము, హిందూ విశ్వాసాల మధ్య తేడా ఉందంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వివాదానికి తెరతీశారు. ఒక వైపు మైనారిటీ ఓట్లు పోకుండా, మరోవైపు మోడరేట్ హిందూ ఓట్లు దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహంగా 'సాఫ్ట్ హిందుత్వ'ను పావుగా వాడుకుంటున్నట్టు కనిపిస్తోందన్నారు.
కెనడా(Canada)లో ఓ హిందూ వ్యాపారవేత్త ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడటం కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లోని సర్రేలో హిందూ వ్యాపారవేత్త నివసిస్తున్నారు.
దాయాది దేశం పాకిస్థాన్లో ఫిబ్రవరి 2024లో జాతీయ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 3,139 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో ఒకే ఒక్క హిందూ మహిళ ఉంది. ఆమె పేరే సవీరా ప్రకాశ్. 25 ఏళ్ల సవీరా పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించబోతున్నారు.
కెనడాలోని అంటారియో ప్రావిన్స్ (Ontario province) లో దొంగలు హిందూ దేవాలయాలనే (Hindu Temples) టార్గెట్గా చేసుకుని వరుస లూటీలకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ నెలలో మూడు దొంగతనాలు జరిగాయని తెలియజేస్తూ డర్హామ్ పోలీసులు బుధవారం ఆధారాలతో సహా వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలో ఇరు వర్గాల మధ్య మత ఘర్షణ(Communal Riots)లు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వ హిందూ పరిషత్(VHP), భజరంగ్ దళ్(Bajarangdal) ఆధ్వర్యంలో నిర్వహించిన శౌర్య జాగరణ్ యాత్ర ఊరేగింపులో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం వారనాసిలోని జ్ఞాన్వాపి మసీదులో కొనసాగుతున్న సర్వేలో కనుగొన్న హిందూ(Hindu) మతానికి సంబంధించిన అన్ని ఆధారాలను జిల్లా మేజిస్ట్రేట్కు(District Majistrate) అప్పగించాలని వారణాసి(Varanasi) కోర్టు బుధవారం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించింది.
మతపరమైన మనోభావాలను గాయపరచారనే ఆరోపణలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని చెప్పిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం మద్దతుగా నిలిచారు. ఉదయనిధి సామూహిక జనహననానికి పిలుపునివ్వలేదని, ఆయన మాటలను మాయోపాయంతో మెలి తిప్పారని అన్నారు.