Share News

Raksha Bandhan: రక్ష బంధన్ రోజు.. మీ సోదరికి ఈ గిఫ్టులిస్తే ఖుషి అవడం పక్కా

ABN , Publish Date - Aug 07 , 2024 | 07:59 PM

రాఖీ లేదా రక్షా బంధన్ భారత్‌లోని అనేక ప్రాంతాలు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రవాసులు జరుపుకునే ఓ హిందూ సంప్రదాయ పండగ. రక్షా బంధన్ ఈ ఏడాది ఆగస్టు 19 వస్తోంది. రాఖీ పండుగ.. అన్న చెల్లెలు, అక్క తమ్ముడి మధ్య ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది.

Raksha Bandhan: రక్ష బంధన్ రోజు.. మీ సోదరికి ఈ గిఫ్టులిస్తే ఖుషి అవడం పక్కా

ఇంటర్నెట్ డెస్క్: రాఖీ లేదా రక్షా బంధన్ భారత్‌లోని అనేక ప్రాంతాలు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రవాసులు జరుపుకునే ఓ హిందూ సంప్రదాయ పండగ. రక్షా బంధన్ ఈ ఏడాది ఆగస్టు 19 వస్తోంది. రాఖీ పండుగ.. అన్న చెల్లెలు, అక్క తమ్ముడి మధ్య ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. ఆ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు 'రాఖీ' అనే పవిత్ర దారాన్ని కట్టి, సోదరుల దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. బదులుగా.. సోదరులు తమ సోదరీమణులను ఆపదలో రక్షిస్తామని మాటిస్తారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరికి ఏదైనా బహుమతిగా ఇస్తారు. త్వరలో రాబోతున్న రక్షా బంధన్‌ కోసం మీ సోదరికి రూ. 2 వేల లోపు బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లైతే ఈ కానుకలపై ఓ లుక్కేయండి.

హెయిర్ డ్రైయర్

ఫిలిప్స్, నోవా, సిస్కా సహా వివిధ బ్రాండ్‌లకు చెందిన హెయిర్ డ్రైయర్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ. 500 నుంచి రూ. 2,000 అంతకంటే ఎక్కువ ధరతో ఉన్నాయి.

హెయిర్ స్ట్రెయిటనర్లు

సెలూన్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా హెయిర్ స్టైలింగ్ కోసం హెయిర్ స్ట్రెయిట్‌నెర్‌లు తీసుకోవచ్చు. ఫిలిప్స్, నోవా, హావెల్స్ సహా వివిధ బ్రాండ్‌ల నుంచి అనేక హెయిర్ స్ట్రెయిట్‌నర్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.600 నుండి రూ.2,000 మధ్యలో, అంతకంటే ఎక్కువ ధరవీ ఉన్నాయి.


స్మార్ట్ స్పీకర్లు

ఇవి వర్చువల్ అసిస్టెంట్‌లుగా కూడా పనిచేస్తాయి. ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి, సమాధానం ఇవ్వడానికి, వినోదాన్ని అందించడానికి ఏఐ టెక్నాలజీసాయంతో పని చేస్తాయి. Amazon, Xiaomi, Google వంటి బ్రాండ్‌ల నుంచి అనేక రకాల స్మార్ట్ స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. 2 వేల బడ్జెట్‌తో Xiaomi స్మార్ట్ స్పీకర్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇయర్‌బడ్స్

ఇయర్‌బడ్‌లను సంగీతం వినడానికి, కాల్స్ మాట్లాడుకోవడానికి ఉపయోగించవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్, ట్రూ వైర్‌లెస్ టెక్నాలజీతో భారతీయ మార్కెట్లో చాలా మంచి ఇయర్‌బడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్‌ల ధర రూ. 1,000 నుంచి రూ. 2,000 అంతకంటే ఎక్కువవీ ఉన్నాయి.


బ్లూటూత్ ట్రాకింగ్ పరికరం

బ్లూటూత్ ట్రాకర్ మీ మొబైల్‌తో వైర్‌లెస్ కనెక్షన్‌ని ఏర్పరచుకోవడానికి బ్లూటూత్‌లో ఎనర్జీని ఉపయోగించుకుంటుంది. క్రమానుగతంగా చిన్న మొత్తంలో డేటాను ప్రసారం చేస్తుంది. ఈ ట్రాకర్లు మార్కెట్‌లో దాదాపు రూ.1,500కే అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి కానుకలిస్తే మీ సోదరీమణులు ఖుషీ అయిపోతారు.

Updated Date - Aug 07 , 2024 | 08:01 PM