Home » HYDRA
మూసీ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన హైడ్రా కూల్చివేతలు అక్రమార్కుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. బుల్డోజర్ రాకముందే ఆక్రమిత స్థలాలు, గోదాములు, షెడ్లను ఖాళీ చేస్తున్నారు.
Telangana: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హైడ్రా ఆర్డినెన్స్‌కు గర్నవర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. హైడ్రా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన..
Musi River Bed Houses: మూసి నిర్వాసితులను ఆదుకునే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మూసీ నిర్వాసితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మూసీ నిర్వాసితులు అధైర్యపడొద్దని..
మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఒప్పించి వారి ఇళ్లను ఖాళీ చేయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మరిచిపోవద్దని అన్నారు. చెరువులు ఎవరు కబ్జా చేశారో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
తన ఫామ్‌హౌస్ బఫర్ జోన్లో లేదు.. FTLలో లేదని మాజీమంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. అధికారులు వచ్చి లీగల్‌గా ఉందని చెప్పారని అన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, సబితా, హరీష్ రావు ఎవరి ఫామ్ హౌస్ ఇల్లీగల్‌గా ఉన్నా కూల్చాల్సిందేనని చెప్పారు. 111జీఓ రాష్ట్రం పరిధిలో లేదని పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
Telangana: హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని పాల్ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం వెల్లడించింది. హైడ్రా కు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ వాదనలు వినిపించారు.
హైడ్రా(Hydra) పేరిట పేదల నివాసాలను కూల్చవద్దని, భూకబ్జాల నుంచి చెరువులు, కుంటలను కాపాడాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ(CPI ML New Democracy) రాష్ట్ర పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
మధురానగర్ కాలనీ మధురమైన కాలనీ కింద ఉండేది ఒకప్పుడు,పద్ధతి ప్రకారం కాలనీ అంటే ఇలా ఉండాలి అనేలా ఉండేది.. ఇప్పుడు ఏ వీధి చూసినా కమర్షియ ల్ కింద అయిపోయిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) అన్నారు.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఓఆర్ఆర్ లోపల ఉన్న ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నింటినీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుందని, ఓఆర్ఆర్ లోపల విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్(M. Danakishore) అధికారులను ఆదేశించారు.
హైడ్రా పేరుతో పేద ప్రజలను పరేషాన్ చేయొద్దని, లేదంటే బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) హెచ్చరించారు.