Share News

Sam Pitroda: ఎన్నికల వేళ శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్

ABN , Publish Date - Jan 28 , 2025 | 06:55 PM

అక్రమవలసదారులపై కేంద్ర కొరడా ఝలిపించడంపై మాట్లాడుతూ, కేవలం అక్రమవలసలపై దృష్టిసారించకుండా గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రజా సమస్యలపై కేంద్రం దృష్టిపెడితే బాగుంటుందని శ్యాం పిట్రోడా అన్నారు.

Sam Pitroda:  ఎన్నికల వేళ శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్

న్యూఢిల్లీ: తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీని ఇరకాటంలో నెట్టే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శాం పిట్రోడా (Sam Pitroda) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులు ఇండియాలో సెటిల్ కావాలని సూచించారు. వలసదారుల సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బీజేపీ భగ్గుమంది. శ్యాం పిట్రోడా వ్యాఖ్యలు దిగ్భాంతి కలిగించేలా ఉన్నాయని, ఏమాత్రం బాధ్యత లేనట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది.

Atishi: ఎన్నికల వేళ సీఎంకు ఉపశమనం.. పరువునష్టం కేసు కొట్టివేత


శ్యాం పిట్రోడా వ్యాఖ్యలతో కూడిన వీడియోను బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. ''రాహుల్ గాంధీ కుడిభుజమైన శ్యాం పిట్రోడా అక్రమవలసదారులను ఇండియాలో స్థిరపడాలని సలహా ఇస్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఆయన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరం, బాధ్యతారాహిత్యం'' అని ప్రదీప్ భండారి అన్నారు. గత 70 ఏళ్లుగా మనదేశంలో అక్రమవలసదారులు స్థిరపడేందుకు అవిశ్రాంతంగా కాంగ్రెస్ ఏవిధంగా పాటుపడటం తలుచుకుంటే అందరూ ఆశ్చర్యపోక తప్పదని అన్నారు. కాగా, తాజా వివాదంపై శ్యాం పిట్రోడా వెంటనే వివరణ ఇవ్వలేదు.


వీడియోలో ఏముంది?

"వాళ్లు (అక్రమ వలసదారులు) ఇక్కడకు రావాలనుకుంటే, అక్రమంగానైనా సరే..రానీయండి. మనం అందరినీ కలుపుకుని వెళ్లాలి. కొత కష్టం ఉండొచ్చు, అయినా ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ వాళ్ల ఇబ్బందులు ఎవరికీ పట్టించుకోవడం లేదు'' అని శ్యాం పిట్రోడా చెబుతున్నట్టు వీడియోలో ఉంది. అక్రమవలసదారులపై కేంద్ర కొరడా ఝలిపించడంపై మాట్లాడుతూ, కేవలం అక్రమవలసలపై దృష్టిసారించకుండా గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రజా సమస్యలపై కేంద్రం దృష్టిపెడితే బాగుంటుందని అన్నారు. ఫిబ్రవరి 5వ తేదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బంగ్లాదేశ్ వలవాదుల అంశాన్ని కీలకంగా ప్రస్తావిస్తున్న నేపథ్యంలో శ్యాం పిట్రోడా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారంనాడు ఎన్నికల ప్రచారంలో ఆమ్ అద్మీ పార్టీపై విరుచుకుపడుతూ, దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లాలో బంగ్లాదేశ్, రోహింగ్యాలకు చొరబాటుదారులకు ఆధార్‌ కార్డులిచ్చారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వారిని ఓట్ బ్యాంకుగా వాడుకోవాలని చూస్తున్నట్టు బీజేపీ ఆరోపిస్తోంది.


వివాదాలకు చిరునామా శ్యాం పిట్రోడా

శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో 'రేసిస్ట్' వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఈశాన్య ప్రాంత ప్రజలు చైనీయుల్లా ఉంటారని, వెస్ట్ ప్రజలు అరబ్బుల తరహాలో, నార్త్‌ ప్రజలు తెల్లగా, సౌత్ ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని వ్యాఖ్యానించారు. అమెరికాలో వారసత్వ పన్ను ఉందని, దీనిపై ఇక్కడ కూడా చర్చించాల్సిన అవసరం ఉందంటూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇండియా ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్య, ఆరోగ్య సమస్యలకు అయోధ్యలో రామాలయం పరిష్కారం కాదంటూ 2023 జూన్‌లోనూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

Mauni Amavasya: మౌని అమావాస్య.. పితృ దోషం నుండి ఇలా బయటపడండి..

Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 28 , 2025 | 06:59 PM