Home » India
భారత దేశానికి తగిన గౌరవం దక్కాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని నొక్కి వక్కాణించారు. ఇది కేవలం విశ్వసనీయతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, అంతకన్నా ఎక్కువ అని చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సామాన్యుల కష్టాలు వర్ణనాతీతం. ఎటు చూసినా, బురద నీటిలో, ఆహారం అందుబాటులో లేక, కనీసం తాగడానికి నీళ్లు లేక వారు ఎదుర్కొనే ఇబ్బందులు బాధాకరం. ఇలాంటి దుస్థితిలో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కాపాడవలసిన ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నందువల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయనే ఆవేదన వారిలో ఉంటుంది.
సదుపాయాలను హుందాగా వినియోగించుకోవలసిన విమాన ప్రయాణికులు ఈమధ్య అనుచితంగా ప్రవర్తిస్తూ, తోటి ప్రయాణికులకు, సిబ్బందికి తలనొప్పిగా మారుతున్నారు. పక్కనున్నవారిపై మూత్ర విసర్జన చేయడం, దాడులకు తెగబడటం వంటి సంఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. తాజాగా ఓ నేపాలీ జాతీయుడు ఎయిరిండియా విమానం సిబ్బందిని దూషించి, లావేటరీ డోర్‌ను విరిచేశారు.
భారత దేశ ఐక్యతను, ముస్లింలను ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ డాక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌కరీం అల్-ఇస్సా ప్రశంసించారు. దేశంలోని ముస్లింలు జాతీయ భావంతో ఉన్నారన్నారు. తాము భారతీయులమని గర్వపడతారని, తమ రాజ్యాంగాన్ని గర్వకారణంగా భావిస్తారని చెప్పారు. న్యూఢిల్లీలోని ఇండియా-ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత దేశ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉండబోతోందని గోల్డ్‌మన్ శాచెస్ (Goldman Sachs) నివేదిక జోస్యం చెప్పింది. ఆర్థిక రంగంలో జపాన్, జర్మనీ, అమెరికాలను వెనుకకు నెట్టి భారత దేశం ఎదగబోతోందని తెలిపింది. 2075నాటికి ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఘనత సాధిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అనే విషయం తెలిసిందే.
ఇది రీల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. ఇండో-పాక్ లవ్ స్టోరీ. యూపీలోని తన ప్రియుడిని దక్కించుకునేందుకు నలుగురు పిల్లలతో సహా పాకిస్థాన్ సరిహద్దులను అక్రమంగా దాటి ఇండియాకు వచ్చిన సీమా గులాం హైదర్ కథ సుఖాంతం కానుంది. హిందూ మతంలోకి మారిన సీమ.. తన పేరును సీమ సచిన్‌గా మార్చుకుంది. సీమను తమ కోడలు చేసుకునేందుకు సచిన్ తల్లిదండ్రులు ముందుకు రావడంతో త్వరలోనే వీరి వాహహం జరుగనుది.
టిబెటన్ల మనోబలం చాలా గొప్పదని చైనాకు తెలిసొచ్చిందని టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) అన్నారు. టిబెటన్ల సమస్యల పరిష్కారం కోసం తనతో అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ చర్చలు జరపాలని చైనా కోరుకుంటోందని, తాను చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమేనని తెలిపారు. న్యూఢిల్లీ, లడఖ్‌లలో పర్యటించడానికి ముందు ఆయన ధర్మశాలలో విలేకర్లతో మాట్లాడారు.
ఓ పాకిస్థానీ మహిళతో సాన్నిహిత్యం కోరుకున్న డీఆర్‌డీఓ (DRDO) శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ అత్యంత దారుణంగా మన దేశ రహస్యాలను ఆమెకు వెల్లడించారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఆయనను మే 3న అరెస్ట్ చేసి, జూన్ 30న ఆయనపై ఛార్జిషీటును దాఖలు చేసింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసు విచారించదగినదేనని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్ణయించింది.
భారత దేశానికి వ్యతిరేకంగా ఖలిస్థానీ ఉగ్రవాదం కెనడాలో పెరుగుతోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని కెనడాను భారత ప్రభుత్వం కోరుతున్నప్పటికీ, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఆ దేశం సరైన రీతిలో స్పందించడం లేదు. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడు (Justin Trudeau) ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవడానికి బదులుగా భారత్‌నే తప్పుబడుతున్నారు.