Home » India
కెనడా (Canada) రాజకీయ పార్టీల నేతలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పెద్ద పీట వేస్తున్నారు. ఖలిస్థానీ ఉగ్రవాదుల వల్ల ఎదురవుతున్న ముప్పు గురించి భారత ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ, ఖలిస్థానీలు పాల్పడుతున్న హింసాకాండ గురించి కెనడా నేతలు నోరు మెదపడం లేదు. మరోవైపు సిక్కు వేర్పాటువాదులు రాడికలైజ్ అవడం పెరుగుతోందని కెనడియన్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్న పాకిస్థాన్, చైనాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కడిగిపారేశారు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పు అని, దీనిని కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. దీనిపై మనమంతా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. షాంఘై సహకార సంఘం (SCO) వర్చువల్ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు.
సిక్కు ఉగ్రవాదులు భారత దేశ వ్యతిరేకతతో రెచ్చిపోతున్నారు. జాతీయ పతాకాన్ని అవమానించడం వంటి దురాగతాలకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్‌కు నిప్పు పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది.
ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థలు భారత దేశ జాతీయ పతాకాన్ని అవమానించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కెనడాను కోరింది. కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద ఈ నెల 8న నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వానికి అధికారికంగా ఓ లేఖ రాసింది.
కడుపు కాలిపోతున్నా పాకిస్థాన్ దుర్మార్గపు బుద్ధిలో మార్పు రావడం లేదు. సొంతింటిని చక్కదిద్దుకోవడం కన్నా భారత దేశాన్ని ఇబ్బందులపాలు చేయడం కోసం సరికొత్త పన్నాగాలు పన్నుతోంది. ఇప్పటి వరకు కశ్మీరు లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎగదోసిన ఆ దేశం ఇప్పుడు జమ్మూపై కన్ను వేసింది. తీవ్ర స్థాయిలో శిక్షణ పొందిన ఉగ్రవాదులకు అత్యాధునిక ఆయుధాలను ఇచ్చి పంపిస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన నడవడిక ద్వారా, భారత దేశ సారాన్ని, భారతీయుల సత్తాను అర్థం చేసుకోవడం ద్వారా అపూర్వ సిద్ధాంతాన్ని సృష్టించారని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor RN Ravi) అన్నారు. సనాతన ధర్మం గురించి ప్రపంచానికి చాటిచెప్పవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. బలం స్నేహితులను తీసుకొస్తుందని, బలహీనత శత్రువులను ఆహ్వానిస్తుందని శుక్రాచార్యుడు ‘శుక్ర నీతి’లో చెప్పారని తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులతో కలుపుగోలుగా ముచ్చటిస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఈ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఢిల్లీ మెట్రోలో ఆయన ప్రయాణికులతో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి బిల్లు (Uniform Civil Code)ను వచ్చే నెలలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. అనంతరం దీనిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించబోతోంది. వివిధ వర్గాల వాదనలను ఈ సంఘం స్వీకరిస్తుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రభావం భారత దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రశంసించారు. మోదీని రష్యాకు గొప్ప మిత్రునిగా ఆయన అభివర్ణించారు. రష్యా ప్రభుత్వ నియంత్రణలోని అంతర్జాతీయ వార్తా టెలివిజన్ నెట్‌వర్క్ ఈ వివరాలను వెల్లడించింది.
ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని టైటానిక్ నౌక శిథిలాలను చూడటం కోసం ఔత్సాహికులను తీసుకెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ (Titan submersible) శకలాల నుంచి కొన్నిటిని స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది. ఇవి మానవ అవశేషాలు అయి ఉండవచ్చునని తెలిపింది. వీటిని తిరిగి అమెరికాకు తీసుకొస్తున్నట్లు, వీటిని పరీక్షించి, విశ్లేషించనున్నట్లు వివరించింది.