Tamil Nadu Governor : మోదీపై తమిళనాడు గవర్నర్ రవి ప్రశంసలు
ABN , First Publish Date - 2023-07-01T15:56:20+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన నడవడిక ద్వారా, భారత దేశ సారాన్ని, భారతీయుల సత్తాను అర్థం చేసుకోవడం ద్వారా అపూర్వ సిద్ధాంతాన్ని సృష్టించారని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor RN Ravi) అన్నారు. సనాతన ధర్మం గురించి ప్రపంచానికి చాటిచెప్పవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. బలం స్నేహితులను తీసుకొస్తుందని, బలహీనత శత్రువులను ఆహ్వానిస్తుందని శుక్రాచార్యుడు ‘శుక్ర నీతి’లో చెప్పారని తెలిపారు.
చెన్నై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన నడవడిక ద్వారా, భారత దేశ సారాన్ని, భారతీయుల సత్తాను అర్థం చేసుకోవడం ద్వారా అపూర్వ సిద్ధాంతాన్ని సృష్టించారని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor RN Ravi) అన్నారు. సనాతన ధర్మం గురించి ప్రపంచానికి చాటిచెప్పవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. బలం స్నేహితులను తీసుకొస్తుందని, బలహీనత శత్రువులను ఆహ్వానిస్తుందని శుక్రాచార్యుడు ‘శుక్ర నీతి’లో చెప్పారని తెలిపారు.
గవర్నర్ రవి శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘‘మీరు బలహీనంగా ఉంటే, మీ చుట్టూ శత్రువులు ఉంటారు; మీరు బలంగా ఉంటే, మీకు స్నేహితులు వస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నడవడిక ద్వారా, భారత దేశ సారాన్ని, భారతీయుల సత్తాను అర్థం చేసుకోవడం ద్వారా అపూర్వ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఆయన ‘అమృత కాలం’ అనే మార్గాన్ని సృష్టించారు’’ అని తెలిపారు.
రానున్న 25 ఏళ్లలో భారత దేశం సనాతన ధర్మ సూత్రాలతో ప్రపంచానికి జ్ఞానాన్ని పంచగలిగే సత్తాను సాధించాలన్నారు. సనాతన ధర్మాన్ని అనుసరించనివారిని కూడా సంతోషంగా ఆమోదిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Maharashtra : మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో అగ్ని ప్రమాదం.. 25 మంది మృతి..
Jaishankar and Shashi Tharoor : విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌పై శశి థరూర్ వ్యాఖ్యలు