Home » Israeli-Hamas Conflict
మరో యుద్ధం అంచున ఉన్న పశ్చిమాసియాలో మరో భీకర దాడి..! సెంట్రల్ గాజాలోని తబీన్ పాఠశాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వరుసగా మూడు క్షిపణులను ప్రయోగించింది. హమా్‌సపై పది నెలలుగా టెల్ అవీవ్ సాగిస్తున్న యుద్ధంలో ఇదొక అతి పెద్ద ఘటనగా అభివర్ణిస్తున్నారు.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా మిలిటరి కమాండ్ ఫూద్ షుక్రు హత్య తర్వాత ఇరాన్ రగిలిపోతుంది. ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామనిఇరాన్ మత పెద్ద అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఈ రోజు (సోమవారం) దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌ను అమెరికా హెచ్చరించింది. ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉండాలని జీ7 సదస్సులో సూచించిందని యాక్సిస్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
చినికి చినికి గాలివానగా మారిందన్న సామెత చందంగా.. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ ఇరాన్ ప్రవేశంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది! ఇజ్రాయెల్‌కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్ధం కాగా..
మొస్సాద్..! ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత శక్తిమంతమైన నిఘా, స్పెషల్ ఆపరేషన్ల సంస్థ..! ఈ సంస్థ ఒక ఆపరేషన్‌ను ఎంచుకుంటే.. శత్రువు అంతంతోనే అది ముగుస్తుంది.
గాజా(Gaza) నగరంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్.. శనివారం వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో కనీసం 15 మంది పాలస్తీనియన్లు మరణించారు.
అసలే ఉద్రిక్తతలకు నెలవైన పశ్చిమాసియాలో ఓవైపు హమా్‌స-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుండగానే, మరో యుద్ధం తప్పదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రత్యక్ష దాడులకు దిగాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇజ్రాయెల్‌ను వదలబోమని హమాస్ సంస్థ కూడా ప్రకటన చేసింది. హనియా మృతితో పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారే అవకాశం ఉంది.
హమాస్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇరాన్ రక్షణలో ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురైన మరునాడే హమాస్ మిలిటరీ చీఫ్, ఇజ్రాయెల్‌పై దాడుల వ్యూహకర్త మహమ్మద్ డెయిఫ్ హతమయ్యాడు.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాపై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. టెహ్రాన్‌లోని ఆయన నివాసం లక్ష్యంగా దాడి చేశారు. దాంతో ఇస్మాయిల్ చనిపోయాడని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఖతార్‌లో ఇస్మాయిల్ హనియా మంగళవారం పలు రాజకీయ కార్యకలపాల్లో పాల్గొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
గతేడాది అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైన ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా.. హమాస్‌ని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతో గాజాలో...