Share News

Jaggareddy: చిన్ననాటి నుంచే శ్రీరాముడి సేవకుడిని

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:22 AM

45 ఏళ్ల క్రితం శ్రీరాముడి సేవలు ప్రారంభించిన జగ్గారెడ్డి, సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో సంగారెడ్డి అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు

Jaggareddy: చిన్ననాటి నుంచే శ్రీరాముడి సేవకుడిని

45 ఏళ్ల క్రితమే సంగారెడ్డి రామ్‌మందిర్‌ వద్ద గుంజలు పాతి, మామిడాకుల తోరణాలు కట్టేవాణ్ని

సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో సంగారెడ్డిని అభివృద్ధి చేస్తా

రామ్‌మందిర్‌ బస్తీలో ఉంటూ కౌన్సిలర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, ఎమ్మెల్యేగా గెలిచా

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఏప్రిల్‌ 6 : ‘‘నా చిన్ననాటి నుంచే శ్రీరాముడికి సేవకుడిని.. 45 ఏళ్ల క్రితమే సంగారెడ్డి రామ్‌మందిర్‌లో జరిగే సీతారాముల కల్యాణానికి గుంజలు పాతి, మామిడాకుల తోరణాలు కట్టేవాణ్ని.. ఆనాటి నుంచే రామ్‌మందిర్‌లో నా సేవ ప్రారంభమైంది. ఇదే రామ్‌మందిర్‌ బస్తీలో ఉంటూ కౌన్సిలర్‌గా, మున్సిపల్‌ చైర్మన్‌గా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే ఆ శ్రీరాముడి ఆశీర్వాదంతోనే.. ’’అంటూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన భక్తిని చాటుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం సంగారెడ్డిలోని రామ్‌మందిర్‌లో సీతారాముల కల్యాణాన్ని జగ్గారెడ్డి దంపతులు ఘనంగా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి పర్యవేక్షణలో కళ్యాణ వేడుక జరిగిన అనంతరం వేలాది మంది భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత సీతారాముల కల్యాణం కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టానని చెప్పారు. కల్యాణం ఉందంటే డబ్బులు లేకున్నా.. సమయానికి ఎక్కడి నుంచో వస్తాయని, కల్యాణాన్ని అద్బుతంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. వతన్‌దారుల చేతుల మీదుగానే కల్యాణాన్ని జరిపిస్తున్నానని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆ శ్రీరాముడి కటాక్షంతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని జగ్గారెడ్డి ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 05:22 AM