Share News

Jammalamadugu: కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు

ABN , Publish Date - Feb 05 , 2025 | 03:12 PM

Republic Club: జమ్మలమడుగులోని రిపబ్లిక్ క్లబ్‌ను పోలీసులు మూ సి వేశారు. ఎంపీ ఫిర్యాదుతోపాటు మీడిాయాలో వరుస కథనాలు నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదీకాక.. ఉదయం 10.00 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు నిర్విరామంగా సదరు క్లబ్‌లో పేకాట నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Jammalamadugu: కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు

కడప, ఫిబ్రవరి 05: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతోపాటు అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేష్‌ ఫిర్యాదు నేపథ్యంలో జమ్మలమడుగులో రిపబ్లిక్ క్లబ్‌ను బుధవారం పోలీసులు మూసి వేశారు. రిపబ్లిక్ క్లబ్‌లో ఇటీవల ఉదయం నుంచి అర్థరాత్రి వరకు అనధికారికంగా పేకాట నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ క్లబ్‌పై పోలీసులు దాడులు చేశారు. అనంతరం క్లబ్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత క్లబ్‌ను పోలీసులు మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటన చేశారు.

సదరు క్లబ్‌లో పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులకు వరుస ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ముద్దనూరు రోడ్డులోని ఈ క్లబ్‌లో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం క్లబ్‌లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనఖీల్లో భాగంగా క్లబ్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.

మరోవైపు సదరు క్లబ్‌లో ఉదయం 10.00 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు అనధికారికంగా పేకాటను 11 టేబుళ్లపై నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. జిల్లా మేజిస్ట్రేట్‌తోపాటు జిల్లా ఎస్పీకి లేఖలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనంతరం నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. అదికాక.. స్థానిక కూటమి నేతల ఆధ్వర్యంలో ఈ పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఈ క్లబ్‌ను మూసివేశారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 05 , 2025 | 03:15 PM